ఆ జైల్లో ఖైదీలు చేసే వ్య‌వ‌సాయంతో ఏడాదికి 2 కోట్ల ఆదాయం వ‌స్తుంది.!!

empty mind is devil’s workshop అన్నారు మ‌హానుభావులు… ఏ ప‌నీ చేయ‌కుండా ఖాళీగా ఉంటే వచ్చే ఆలోచ‌న‌లు మెద‌డును తొల‌చివేస్తాయి. క‌నుక ఏదో ఒక ప‌నిలో బిజీగా ఉంటే మెద‌డు, మ‌న‌స్సు ఏ చెడు ప్ర‌భావానికి లోను కాదు.. అన్న విష‌యాన్ని ఉద్దేశించి గొప్పోళ్లు ఈ మాట చెప్పారు. అయితే నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉండే ఖైదీలు కూడా ఇప్పుడిదే మాట‌ను ఫాలో అవుతున్నారు. వారిలో వేగంగా మార్పు తెచ్చేందుకు జైలు అధికారులు చేసిన ప్ర‌య‌త్నం స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. అదేమిటంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు సెంట్ర‌ల్ జైలులో 25 ఎక‌రాల ఖాళీ స్థ‌లం ఉంది. అందులో ఖైదీలు వివిధ ర‌కాల పంటలు పండించేందుకు జైలు అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది ఇప్పుడా ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అంతేకాదు జైలులో ఉండే 200 మంది ఖైదీలు పండించిన పంట‌ల‌ను జైలు అధికారులే కొంటారు. అలా జైలు అవ‌స‌రాల‌కు పంట‌ల‌ను కొన‌గా మిగిలిన వాటిని మార్కెట్‌లో విక్ర‌యిస్తారు. ఈ క్ర‌మంలో ఖైదీల‌కు డ‌బ్బులు కూడా వ‌స్తున్నాయి. అయితే కేవ‌లం పంట‌లు పండించ‌డం మాత్ర‌మే కాదు, ఆ ఖైదీలు డెయిరీ ఫాం కూడా పెట్టారు.

మొద‌ట్లో జైలు అధికారులు 10 గేదెల‌ను కొన్నారు. అనంత‌రం డెయిరీ ఫాం ఏర్పాటు చేశారు. అందుకు అయిన రూ.6 ల‌క్ష‌ల‌ను బ్యాంక్ లోన్ తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు గేదెల నుంచి ల‌భించే పాల‌ను జైలు అధికారులే జైలు కోసం కొంటున్నారు. అలా వ‌చ్చిన డ‌బ్బుతో బ్యాంక్ లోన్ తీర్చేశారు కూడా. దీంతో మ‌రో 15 గేదెల‌ను కొన్నారు. ఇప్పుడ‌క్క‌డ మొత్తం 25 గేదెలు ఉన్నాయి. అంతేకాదు, 10 ఆవులు, 80 గొర్రెలు కూడా ఉన్నాయి. ఇక ఆ ఖైదీలంతా పంట‌ల ద్వారా ఏడాదికి తెస్తున్న ఆదాయం ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.2 కోట్లు..! అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఖైదీల్లో ప‌రివ‌ర్త‌న వ‌చ్చేలా జైలు అధికారులు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని నిజంగా అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top