ఇవాళ్టి నుంచి ధరలు పెరిగే.. తగ్గే వస్తువులు ఇవే!

ఆర్ధిక సంవత్సరం శనివారం నుంచే మొదలు కానుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యక్ష, పరోక్ష పన్నులను రివైజ్‌ చేశారు. అవి శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం కొన్ని వస్తువుల రేట్లు పెరగనున్నాయి..మరి కొన్ని వస్తువుల రేట్లు తగ్గనున్నాయి.

పెరిగేవి:

  • సిగరెట్లు, పాన్ మసాల, పేపరు చుట్టిన, చేతితో తయారు చేసిన బీడీలు, పొగాకు ఉత్పత్తులు,
  • ఎల్ ఈడీ దీపాల విడిభాగాలు,
  • వెండి పతకాలు, 99.9%స్వచ్ఛత ఉన్న వెండి నాణేలు,
  • సాల్టెడ్‌ జీడి పప్పు,
  • భారత్‌లో తయారయ్యే మొబైల్‌ఫోన్లు,
  • ఫోన్లలో వాడే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీ)
  • కార్లు,మోటారు సైకిళ్ల బీమా

తగ్గేవి:

  • సౌర శక్తితో పనిచేసే ఉపకరణాలు,
  • ఇళ్లల్లో వాడే ఆర్వో వాటర్‌ ఫిల్టర్లు,
  •  ఆన్ లైన్ రైల్వే టికెట్లు,
  • లెదర్ తో తయారయ్యే ఉత్పత్తుల్లో కొన్ని వస్తువులు,
  • పీఓఎస్ యంత్రాలు/ కార్డులు,
  • ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా పని చేసే యంత్రాలు

Comments

comments

Share this post

scroll to top