తప్పు చేసినందుకు ఏకంగా రాజుకే ఉరి శిక్ష‌ వేసిన సౌదీ ప్రభుత్వం….చట్టాల అమలు అంటే ఇలా ఉండాలి.

చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే. ఎంత ఉన్న‌త స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప‌వారైనా, ధ‌న వంతులైనా, పేద‌లైనా వారంద‌రూ చ‌ట్టం ముందు ఒక్క‌టే. త‌ప్పు చేస్తే అందరికీ విధించే శిక్ష కూడా ఒక‌టే. ఇందులో తార‌త‌మ్యాలు ఉండ‌వు. ఇదీ… మ‌న భార‌త శిక్షాస్మృతి చ‌ట్టం చెబుతున్న‌ది. కానీ ఇది ఎంత వ‌రకు అమ‌లవుతోంది, గుండె మీద చేయి వేసుకుని ఎవ‌రైనా చెప్ప‌గ‌లరా..? అవినీతి, ధ‌నదాహం పెచ్చ‌రిల్లిన మ‌న స‌మాజంలో డ‌బ్బున్న వారిది, బ‌డాబాబుల‌దే ఆధిప‌త్యం అవుతోంది. ఈ క్ర‌మంలో వారు ఎంత‌టి నేరాలు చేసినా సుల‌భంగా త‌ప్పించుకుని తిరుగుతున్నారు. అందుకు మ‌న దేశంలో ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా మ‌న ద‌గ్గ‌ర. కానీ సౌదీ అరేబియా దేశంలో మాత్రం అలా కాదు. నిందితుడంటే నిందితుడే. అత‌ను ఎవ‌రైనా కావ‌చ్చు. అలాగే శిక్ష కూడా ఒక్కటే, అదే మ‌ర‌ణ శిక్ష‌. అది హ‌త్య‌ల‌కు సంబంధించి ఆ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం విధించే శిక్ష‌..!

turki-bin-saud-al-kabir

సౌదీ అరేబియాలో ఉండే చ‌ట్టాల గురించి, అక్క‌డి క‌ఠినమైన శిక్ష‌ల గురించి అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ ఎవ‌రైనా ఏదైనా చిన్న నేరం చేసినా చాలు అందుకు శిక్షలు క‌ఠినాతి క‌ఠినంగా ఉంటాయి. అందుకు అక్క‌డి రాజ కుటుంబీకులు కూడా మిన‌హాయింపేమీ కాదు. దాన్ని రుజువు చేస్తుంది తాజా సంఘ‌ట‌న‌. సౌదీ అరేబియాకు చెందిన రాజు తుర్కి బిన్ సౌద్ అల్‌-క‌బీర్ 2012లో ఆదిల్ అల్‌-మ‌హ‌మ్మ‌ద్ అనే త‌న స్నేహితున్ని చంపేశాడు. అనంత‌రం తుర్కి బిన్‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, అత‌నిపై కేసు కోర్టులో కొన‌సాగ‌డం అన్నీ జ‌రిగిపోయాయి. ఈ మ‌ధ్యే ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు కూడా ఇచ్చేశారు. అయితే నిందితుడైన ఆ రాజుకు అక్క‌డి న్యాయ‌స్థానం విధించిన శిక్ష ఏమిటో తెలుసా..? మ‌ర‌ణ‌ శిక్ష‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. రాజు అయినా చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే అన్న ఒకే ఒక నియ‌మంతో అక్క‌డి న్యాయ స్థానం అత‌నికి మ‌ర‌ణ‌ శిక్షను అమ‌లు చేసింది కూడా. అయితే అత‌నికి శిక్ష‌ను అమ‌లు చేసే దాక బ‌య‌టికి విష‌యం చెప్ప‌లేదు. శిక్ష అమ‌ల‌య్యాక అత‌ను చ‌నిపోయాడ‌ని మాత్రం ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

అయితే స‌ద‌రు తుర్కి బిన్‌కు మ‌ర‌ణ శిక్ష ఎలా అమ‌లు చేశార‌న్న‌ది మాత్రం ఆ ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌లేదు. కానీ సాధార‌ణంగా అక్క‌డ మ‌ర‌ణ‌శిక్ష అంటే క‌త్తితో త‌ల న‌ర‌క‌డ‌మే ఉంటుంది. అదే లాంటి శిక్ష‌ను ఆ రాజుకు కూడా అమ‌లు చేసి ఉంటార‌ని అక్క‌డి మీడియా క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది. కాగా స‌ద‌రు రాజ కుటుంబీకులు బాధిత కుటుంబానికి పెద్ద ఎత్తున డ‌బ్బు ఇస్తామ‌ని చెప్పార‌ట‌. అయినా వారు అందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో అక్క‌డి న్యాయ‌స్థానం రాజుకు మ‌ర‌ణ దండ‌న విధించింది. ఈ క్ర‌మంలో ఇప్పుడీ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మే అయింది. అయితే ఈ ఏడాది సౌదీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన మ‌ర‌ణ శిక్ష‌ల్లో ఇది 134వ ద‌ట‌. అంటే అంత‌కు ముందు 133 నిందితుల‌ను ఇలాగే శిక్షించార‌ట‌. కాగా ఒక రాజ కుటుంబానికి చెందిన వ్య‌క్తికి మ‌ర‌ణ శిక్ష ప‌డ‌డ‌మనేది ఇది రెండో సార‌ట‌. అంత‌కు ముందు 1975లో ఫైజ‌ల్ అనే రాజును హత్య చేసినందుకు గాను అదే రాజ కుటుంబానికి చెందిన ఫైస‌ల్ బిన్ ముసైద్ అల్ సౌద్ అనే రాజుకి ఇలాగే శిక్ష ప‌డింద‌ట‌. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి తుర్కి బిన్ మ‌ర‌ణ శిక్ష పొందిన రాజుల్లో రెండో వాడిగా నిలిచాడు. అయితే సౌదీలో చ‌ట్టాలు అంత క‌ఠినంగా ఉండ‌బ‌ట్టి ఇదంతా సాధ్య‌మైంది కానీ, అదే మ‌న దేశంలోనా… బాధితుల‌కు అస‌లు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం ఏ కోశానా ఉండ‌దు. అది రాజ కుటుంబమైనా, మ‌రో బ‌డా బాబు కుటుంబమైనా… నిందితులుగా ఉంటే ఇక న్యాయం అనే మాట‌ను మ‌రిచిపోవ‌డం మంచిదేమో..!

Comments

comments

Share this post

scroll to top