రాత్రి నిద్రకు ముందు మీ చేతి వేళ్లను ఇలా చేసి చూడండి. అద్భుత ఫలితాలొస్తాయి.

కేవలం 5 నిమిషాల పాటు ఈ సింపుల్ హ్యాండ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా శరీరాన్ని ఎలా ఉత్తేజంగా ఉంచుకోవచ్చో తెలుసుకోండి… శరీరంలోని కొన్ని భాగాలపై కొంత సేపు ఒత్తిడి కలిగించడం ద్వారా పలు రుగ్మతలను నయం చేసుకోవచ్చని ఆక్యుప్రెషర్ చెబుతోంది. మనలో అధిక శాతం మందికి దీని గురించి తెలుసు. అయితే ఇప్పుడు చెప్పబోయే జిన్ షిన్ జ్యుత్సు అనే పురాతనమైన విధానం కూడా సరిగ్గా ఇదే విధంగా పనిచేస్తుంది. కాకపోతే దీంట్లో కేవలం చేతి వేళ్లపై ఒత్తిడి కలిగించడం ద్వారా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు శక్తిని కూడదీసుకోవచ్చు, మానసిక ఉల్లాసం కూడా పొందవచ్చు.
జిన్ షిన్ జ్యుత్సు చెబుతున్న విధానం ప్రకారం ప్రతి చేతి వేలు శరీరంలోని ఏదో ఒక అవయవానికి వివిధ నరాల ద్వారా అనుసంధానమై ఉంటుందట. ఈ నేపథ్యంలోనే సంబంధిత చేతి వేలిపై కొంత సేపు ఒత్తిడి కలిగించినా, లేదంటే ఆ వేలిని కొంత సేపు ఒత్తి పట్టుకున్నా నిర్దేశిత మానసిక నియంత్రణను మనం పొందేందుకు అవకాశం ఉంటుందట. ఇది శారీరక, మానసిక ఒత్తిడిని తొలగిస్తుందట. ముందుగా ఒక వేలిపై ఒత్తిడి కలగజేయడం ప్రారంభిస్తే దాని వల్ల రెండో వేలిపై ఒత్తిడి పెంచాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఒకానొక సందర్భంలో ఐదు వేళ్లపై ఒత్తిడి కలగజేస్తామన్నమాట. దీంతో మనసు నియంత్రణ సాధ్యమవుతుంది.
451092584
ఇదే కాకుండా ఒక్కో వేలిని రెండు, మూడు శ్వాస ఉఛ్వాస, నిశ్వాసల వరకు పట్టుకుని ఒత్తిడి కలగజేస్తూ ఉంచినా  ఆశించిన ఫలితం కనిపిస్తుంది. రోజూ దీన్ని ప్రాక్టీస్ చేస్తే మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.
రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు జిన్ షిన్ జ్యుత్సు విధానాన్ని ప్రాక్టీస్ చేస్తు ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయట. అంతేకాదు ఇది మనకు చక్కని నిద్రను కూడా అందిస్తుంది.
170634672
అరచేతిలో మధ్య భాగం కిందగా ఒత్తిడిని కలగజేస్తే శ్వాస ప్రక్రియపై నియంత్రణ వస్తుంది. రొమ్ముభాగం ఉత్తేజితం అవుతుంది. అదేవిధంగా బొటనవేలిపై ఒత్తిడితో కడుపు నొప్పి, తలనొప్పి, ఆతృత, డిప్రెషన్, చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అదే చూపుడు వేలిపై అయితే కిడ్నీ, మూత్రాశయ సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, మలబద్దకం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, దంతాలు, దవడల సమస్యలను దూరం చేసుకోవచ్చు. మధ్య వేలితో గాల్ బ్లాడర్, లివర్, రక్త సరఫరా, అలసట, లైంగిక సామర్థ్యం, తలనొప్పి, రుతు సంబంధ సమస్యలు, దృష్టి, నేత్ర దోషాల వంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఉంగరపు వేలితో ఊపిరితిత్తులు, జీర్ణప్రక్రియ, శ్వాస సమస్యలు (ఆస్తమా), చర్మ సమస్యలు, చెవుల్లో శబ్దాలు రావడం వంటి వాటిని తగ్గించుకోవచ్చు. చిటికెన వేలితో గుండె, పేగులు, ఎముకలు, నరాలు, బీపీ, అజీర్ణం, గ్యాస్, ఆతృత, కంగారు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. నిద్రలేమితో బాధపడే వారు కుడి చేతిని ఛాతీ ఎముకలపై ఎడమభాగంలో పెట్టి ఎడమ చేతి బొటన వేలిని కుడి చేయిపై పెట్టి ఒత్తిడి కలగాలి.

Comments

comments

Share this post

scroll to top