అతనో స్పెషల్ రెస్యూమ్ తయారు చేసాడు..దెబ్బకు ఇంటర్వ్యూ చేయకుండానే అతన్ని సెలెక్ట్ చేసారు.! ఎందుకో తెలుసా?

అంద‌రిలా ఆలోచిస్తే మ‌న‌కూ, ఇత‌రుల‌కూ తేడా ఏముంటుంది. ఏదైనా వెరైటీగా చేస్తేనే క‌దా, న‌లుగురిలోనూ గుర్తింపు ల‌భించేది. అవును, అది నిజ‌మే. న‌లుగురి క‌న్నా భిన్నంగా ఏ ప‌నైనా చేస్తే అంద‌రిలోనూ ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా ఎవ‌రికైనా పేరు వ‌స్తుంది. ఆ పేరే ఆ వ్య‌క్తికి మంచి స్థానాన్ని కూడా సంపాదించి పెడుతుంది. స‌రిగ్గా ఇలాగే ఆలోచించాడు ఆ యువ‌కుడు. అందుక‌నే తాను ఇంట‌ర్వ్యూకు వెళ్లే ఓ సంస్థ కోసం త‌న రెజ్యూమ్‌ను విభిన్నంగా త‌యారు చేశాడు. సృజ‌నాత్మ‌క‌త‌ను జోడిస్తూ ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌ను సీవీతోనే ఆక‌ట్టుకున్నాడు. దీంతో జాబ్ వెంట‌నే వ‌చ్చేసింది.

అత‌ని పేరు సుముఖ్ మెహ‌తా. వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. ఈ యువ‌కుడు ఈ మ‌ధ్య జీక్యూ అనే కంపెనీకి ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యాడు. అయితే అందుకు గాను సుముఖ్ త‌న రెజ్యూమ్‌ను వినూత్న రీతిలో త‌యారు చేసుకున్నాడు. సాధార‌ణ ప్రింట్ అవుట్‌లా కాకుండా మ్యాగ‌జైన్ త‌ర‌హాలో త‌న రెజ్యూమ్‌ను సుముఖ్ క్రియేట్ చేశాడు. చూడ‌చ‌క్క‌ని రంగుల్లో ఆక‌ర్షణీయ‌మైన డిజైన్‌లో 20 పేజీల మ్యాగ‌జైన్ స్టైల్‌లో రెజ్యూమ్‌ను త‌యారు చేశాడు. త‌న విద్యార్హ‌త‌లు, హాబీలు, అనుభ‌వం వంటి వివ‌రాల‌ను ఆ రెజ్యూమ్‌లో ఒక్కో పేజీలో మ్యాగ‌జైన్ త‌ర‌హాలో డిజైన్ చేశాడు.

ఇక సుముఖ్ తాను త‌యారు చేసిన త‌న రెజ్యూమ్ మొద‌టి పేజీని కూడా అచ్చం మ్యాగ‌జైన్ ముఖ‌చిత్రం లాగానే క్రియేట్ చేశాడు. ముఖ‌చిత్రం స్థానంలో త‌న ఫొటోను ప్రింట్ చేశాడు. అలా ఫొటోను ఎందుకు ప్రింట్ చేశాడు, ఆ మ్యాగ‌జైన్ రెజ్యూమ్‌పై తన ఫొటో ఎందుకు ఉంది వంటి వివ‌రాల‌ను కూడా సుముఖ్ చివ‌ర‌గా చేర్చాడు. ఈ క్ర‌మంలో పూర్తి స్థాయిలో త‌యారు చేసిన త‌న రెజ్యూమ్‌తో సుముఖ్ జీక్యూ ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యాడు. అయితే ఇంట‌ర్వ్యూయ‌ర్లు సుముఖ్ క్రియేటివిటీకి విస్తు పోయారు. అత‌ను త‌యారు చేసిన రెజ్యూమ్‌ను చూసి వారు ఫ్లాట్ అయ్యారు. ఇంకేముందీ, వెంట‌నే అత‌నికి జాబ్ ఇచ్చేశారు. సుముఖ్ టాలెంట్ న‌చ్చ‌డంతో జీక్యూ యాజ‌మాన్యం అత‌నికి లండ‌న్‌లో 6 నెల‌ల పాటు ఇంట‌ర్న్‌షిప్ చేయ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. కాగా సుముఖ్ అలా త‌యారు చేసిన రెజ్యూమ్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ రెజ్యూమ్ ఫొటోలు ఇప్పుడు నెట్‌లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సుముఖ్ ఐడియా భ‌లేగా ఉంది క‌దా..! ఎవ‌రైనా ఇలా క్రియేటివిటీ చేస్తే జాబ్ పొందడం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top