“ప్రేమిస్తే” భరత్ గుర్తున్నాడా.? ఇప్పుడెలా మారిపోయాడో తెలుసా.? కారణం తెలుస్తే షాక్ అవుతారు!

సినిమాలో విలన్ అంటే ఇంతకు ముందు ఎలా ఉండేవారు ..ఒడ్డు పొడుగుతో, గళ్ళ లుంగీ, బుగ్గన గాటు, ఎర్రని కళ్ళతో చూడగానే భయం పుట్టించే రూపంతో ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా స్టైలిష్ గా ఉంటున్నారు.హీరోలకు ధీటుగా నటనే కాదు క్రేజ్ కూడా సంపాదించుకుంటున్నారు.ఇంతకుముందు మోహన్ బాబు ,చిరంజీవి నెగటివ్ రోల్స్ చేసి తర్వాత హీరోలైతే ఇప్పుడొస్తున్నవిలన్లు ఇంతకు ముందు హీరోలుగా పేరు సంపాదించుకున్నవారు..అందుకు ఉదాహరణ అరవింద్ స్వామి,జగపతిబాబు…వరుడు లో విలన్ గా చేసిన ఆర్యన్.. ఇప్పుడు విలన్ బాట పట్టాడు ప్రేమిస్తే ఫేం భరత్..

ప్రేమిస్తే సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటుడు భరత్.తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా ఘన విజయం సాధించింది.దానికంటే ముందు బాయ్స్ సినిమాలో కూడా భరత్ నటించాడు.అది కూడా తమిళ్ డబ్బింగే.ప్రేమిస్తే  తర్వాత భరత్ తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా దూరమయ్యాడు..మళ్లీ ఇప్పుడు స్పైడర్లో విలన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దానికోసం సిక్స్ ప్యాక్ కూడా పెంచాడు. ప్రేమిస్తే సినిమాలో ఒక సాధారణంగా, బక్కగా ఉన్న వ్యక్తి కాస్త ఇప్పుడు సిక్స్ ప్యాక్ తో అదరగొట్టడం నిజంగా విషయమే.

స్వయంగా మురుగదాస్ కాల్ చేసి స్పైడర్ లో విలన్ క్యారెక్టర్ కోసం చూస్తున్నాను చేస్తావా అని అడిగితే ఎవరు మాత్రం కాదంటారు. టాప్ డైరెక్టర్ మురుగదాస్ నుండి కాల్ రావడమే విషేశమైతే మహేశ్ లాంటి స్టార్ హీరో తో యాక్ట్ చేయడం.. తన క్యారెక్టరైజేషన్ కూడా భరత్ కు చాలా నచ్చి మరో మాట లేకుండా సినిమాలో యాక్ట్ చేయడానికి ఒకే చెప్పారట. తెలుగులో నేరుగా వస్తున్న ఈ చిత్రం లో విలన్ రోల్ తో  భరత్ ఎంత వరకు ఆకట్టుకుంటాడనేది వేచి చూడాలి.మురుగదాస్  తనకు ఏం కావాలో రాబట్టుకోవడంలో దిట్ట. మరి భరత్ నుండి ఎలాంటి నటన రాబట్టాడు..భరత్ ఈ విలన్ రోల్ తోనే తెలుగులో కంటిన్యూ అవుతాడా? లేక హీరో గా కూడా చాన్స్ లు కొడతాడా అనేది స్పైడర్ లో అతని పెర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటుంది..

Comments

comments

Share this post

scroll to top