ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మనసులో మరో వ్యక్తి ఉన్నాడని తెలిసి అతని ఏం చేసాడో తెలుసా.?

ప్రేమించిన ప్రియురాలిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా జీవితం గడపాలనుకున్న యువకుడికి అనుకోని అవాతరం ఎదురైంది..భార్య రూపంలో.. తన కుటుంబంలో సంతోషాలు నింపుతుందనుకున్న భార్య కన్నీళ్లకు కారణమవుతుందని తెలియక..తట్టుకోలేక తనువు చాలించాడు..కన్న తల్లిదండ్రులకు ,తోడబుట్టినవాడికి శోకం మిగిల్చాడు.. ఇంత చేసి చనిపోయి అతడు సాధించినదేంటి అంటే శూన్యం..కుటుంబానికి కన్నీళ్లు తప్ప..

కర్నూలు లోని గోనెగండ్ల పట్టణానికి చెందిన సుబ్రమణ్యంశెట్టి , విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినయ్‌ కుమార్‌ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. తమ్ముడు వంశీకృష్ణతో కలసి పత్తికొండలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.వినయ్ కుమార్‌కు తన అమ్మమ్మగారి ఊరు వెల్దుర్తికి చెందిన సౌజన్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో నవంబర్‌ 1న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. పెళ్లి నాటికే పరిచమైన మరో యువకుడితో సౌజన్య ప్రేమలో పడిందని కుటుంబసభ్యుల కథనం. దీంతో కాపురానికి రాకుండా.. వినయ్‌కుమార్‌కు దూరంగా ఉంటోంది.

వినయ్ నుంచి విడాకులు కావాలని కోరుతూ.. ఘర్షణ పడిన సౌజన్య 3 వారాల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం (ఫిబ్రవరి 12) ఉదయం వినయ్‌‌కు ఫోన్ చేసిన ఆమె అత్త అమృతవల్లి.. సౌజన్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కర్నూలు ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పింది. దీంతో వినయ్ వెంటనే తన తమ్ముడితో కలిసి ఆసుపత్రికి వెళ్లాడు. అయితే.. అక్కడ మరోసారి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.తీవ్ర మనస్తాపం చెందిన వినయ్‌.. మధ్యలో పని చూసుకొని వస్తానంటూ తమ్ముడికి చెప్పి, కార్బైడ్‌ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసి తన తమ్ముడికి పంపించాడు.

‘సంతోషం తప్ప బాధ ఎలాంటిదో తెలియదు. అనేక కష్టాలుపడ్డా.. అమ్మ అలా పెంచింది. తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నా. ఆమె నుంచి ఇసుమంత ప్రేమ కూడా దొరకలేదు. పైగా దూరం పెడుతూ వేధించడం మొదలుపెట్టింది. సర్దుకుపోదామనుకున్నా.. చివరకు నన్ను ఎంతగానో ప్రేమించే అమ్మపైనే చేయిచేసుకునేంత వరకు వెళ్లా. కానీ, ఆమె మన ఇంట్లోని సంతోషాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిందని తెలిసి తట్టుకోలేకపోతున్నా. అమ్మా.. నాన్నా.. నన్ను తమ్ముడిలో చూసుకోండి’ అంటూ తమ్ముడికి సందేశం పంపి ఆత్మహత్య చేసుకున్నాడు వినయ్…క్షణికావేశంతో వినయ్ తీసుకున్న నిర్ణయానికి కన్నీరుమున్నీరవుతున్న ఆకుటుంబాన్ని చూసి బాదపడడం తప్ప ఏంచేయలేం..

Comments

comments

Share this post

scroll to top