ప్రేమించిన అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ నీచుడు.! ఎందుకో తెలుస్తే ఆ నీచుడిని చంపేయాలనిపిస్తది!

ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించడంతో గాయపడిన సంధ్యారాణి చనిపోయింది.ప్రేమించకపోతే యాసిడ్ దాడులు,గ్యాంగ్ రేపులు,కత్తితో పొడవడం..ఇలా ఏదో ఒక విధంగా దాడులు చేయడం… అమ్మాయిలు నిత్యం భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి.. ప్రేమించలేదనే ఏకైక కారణంతో కార్తిక్ అనే యువకుడు సంధ్యని చంపేశాడు.సంధ్య ఎవరూ,కార్తిక్ తో ఎలా పరిచయం…చంపేసేంత తప్పు సంధ్య ఏం చేసింది..అంత  పగ ఎందుకు పెంచుకున్నాడు.. వివరాలు..

నేరెడు సంధ్యారాణి తల్లి సావిత్రి, , అక్కతో లాలాగూడలోని భజన సమాజంలో నివాసముంటోంది. శాంతినగర్‌లోని ఓ అల్యూమినియం దుకాణంలో పనిచేస్తోంది.సంధ్య జీతంతోనే కుటుంబం నడుస్తోంది.ఒకే దగ్గర పనిచేస్తుండడంతో రెండేళ్ల నుంచి కార్తీక్‌తో సంధ్యారాణికి పరిచయం ఉంది.కానీ  కొంతకాలంగా కార్తీక్ ఉద్యోగం మానేసి,జులాయిగా తిరగడం స్టార్ట్ చేశాడు..చెడుతిరుగుళ్లకు అలవాటుపడ్డ కార్తీక్ ను దూరం పెట్టింది సంధ్య. ప్రేమ, పెళ్లి అంటూ సంధ్యారాణిని కార్తీక్ వెంట పడుతుండడంతో..తనమీదే ఆధారపడి ఉన్న కుటుంబాన్ని కాదనుకుని ఇలాంటివాడితో ప్రేమ ఎలా అనే కారణంతో సంధ్య నిరాకరించింది..

దాంతో తనపై కోపం పెంచుకుని..షాప్ లో  పని పూర్తయ్యాక గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సంధ్యారాణితో కార్తీక్  రోడ్ మీదే  గొడవకు దిగాడు. ఆ తర్వాత ముందె తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై పోశాడు..దాంతో ఆమె జనాలు ఉన్నవైపుగా పరుగందుకుంది..తను పరుగెత్తినవైపే బైక్ పై వెళ్లి నిప్పంటించి పరారయ్యాడు..మంటలకు తట్టుకోలేక కుప్పకూలిపోయిన సంధ్యపై రోడ్ మీద వెళ్తున్న వారు పాత దుస్తులనుకప్పి మంటలార్పారు.  సంధ్య తల్లి  ,అక్కా వెంటనే అక్కడికి చేరుకుని గాంధి హాస్పటల్ కి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది..

ప్రేమించకపోతే అమ్మాయిలపై దాడులు,కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నపిల్లలు,పెద్దవాళ్లు అని చూడకుండా ఆడవాళ్లపై అత్యాచారాలు..మనిషి అనే స్ప్రుహ లేకుండా కృూర మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ స్త్రీలపై దాడులు..యత్రనార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతా అని చెప్పుకునే నేలపై రోజుకొక ఘటన.. ఎటు పోతుంది మన సమాజం.

Comments

comments

Share this post

scroll to top