లవర్ “నో” చెప్పడంతో ఆ అబ్బాయి “సెల్ఫీ వీడియో” తీసాడు..! తర్వాత ఏం చేసాడో తెలుసా.?

ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటవుదామనుకున్నారు.. నాలుగేళ్లపాటు చట్టాపట్టాలేసుకుని తిరిగారు.. కానీ ఇంతలో ఏమైందో ఏమోగానీ ఒక్కసారిగా ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతి కష్టం మీద తల్లిదండ్రులు తమ కుమారుడ్ని బతికించుకుని ఇకపై ఇలాంటి పనులు చేయొద్దు.. ఆ అమ్మాయిని వదిలేయ్ అంటూ నచ్చజెప్పారు. కానీ నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక తన ప్రేమను కంటిన్యూ చేశాడు సాయి చైతన్య. అయితే అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను టార్చర్ పెడుతున్నారంటూ అబ్బాయిపై తప్పుడు కేసు బనాయించారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రియురాలిని వదులుకోలేకపోయాడు సాయి. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

కానీ ఇటీవల ఇంటి నుంచి ఈ ప్రేమజంటకు మధ్య గొడవలు రావడంతో సాయి చైతన్య ఇంట్లోనుంచి వెళ్లిపోయాడని అతని తల్లి మీడియాకు తెలిపింది. ఇంట్లో నుంచి వెళ్లిపోతూ సెల్ఫీ వీడియో తీసి తన చెల్లికి పంపాడు సాయి. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సెల్ఫీ వీడియోలో ఏముందంటే..

“అమ్మా, నాన్నా, చెల్లి నన్ను క్షమించండి.. మీకు మంచి కొడుకును, చెల్లికి మంచి అన్నని కాలేక పోయాను.. ఏం చేయాలో తెలియడం లేదు.. ప్రేమించిన అమ్మాయి మోసాన్ని తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. నాలుగేళ్లు నాతోనే ఉంది.. నువ్వే భర్తవి.. నువ్వే నా సర్వస్వం అని.. నా జీవితంతో ఆడుకుంది.. కానీ చివరికి నన్ను చచ్చిపో అంది. ఏం చేయాలో దిక్కు తోచక ఒకసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను.. అతి కష్టం మీద మీరు నన్ను బతికించుకున్నారు. అయినా ఆ తర్వాత కూడా తను నన్ను అర్థం చేసుకోలేదు”.

” ఏం చేయాలో నాకేమీ అర్దం కావట్లేదు.. అంతే కాకుండా వన్‌ సైడ్‌ లవ్‌ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. తను ప్రేమించిందని.. అన్నీ ఆధారాలు ఉన్నాయన్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు.. సాయం చేయండి సార్ అన్నందుకు సైబర్‌ ఎస్‌ఐ నన్ను బెదిరిస్తున్నాడు. ఎవరి నుంచీ నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు.. నాలుగేళ్లు పెద్దదైనా నా జీవితంలో ఉంటానంటే ప్రాణంగా ప్రేమించాను. కానీ చివరికి ఇలా చేస్తుందనుకోలేదు. నాకు ఉన్నది మీరే.. మీరైనా న్యాయం జరిగేలా చేయండి.. ‘ అంటూ తన చెల్లెళ్లకు వీడియోను పంపాడు. అనంతరం సాయి చైతన్య ఎక్కడో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దయచేసి తమ కుమారుడ్ని తమకు అప్పగించాలంటూ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాయి చైతన్య తల్లి మాటలివి..

తమ కుమారుడు మొదట ఆత్మహత్యకు పాల్పడినప్పుడు పోలీసు కేసు పెట్టామన్నారు. న్యాయం చేయవలసిన పోలీసులు నాగరిక సమాజం సిగ్గుపడే విధంగా మా అబ్బాయిని పరుష పదజాలంతో వేధించడంతో మానసిక క్షోభకు గురయ్యాడని అబ్బాయి తల్లిదండ్రులు తెలిపారు. ప్రేమించి మోసం చేసిన అమ్మాయి ఒకవైపు మరోవైపు ఆమె తల్లిదండ్రులు బెదిరింపులను భరించలేక పది రోజుల నుండి తమ ఏకైక కుమారుడు కనపడకుండా పోయాడని ఆమె భోరున విలపించారు. తమ కుమారుడు సాయి చైతన్యను అమ్మాయి సంధ్య తరపు వారు హత్య చేయించారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

ఇలాంటి అమ్మాయిల ఆగడాలకు నాలాంటి తల్లులు ఎవ్వరు గర్భశోకానికి గురికాకుండా ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. తక్షణమే తమ అబ్బాయి ఆచూకీ కోసం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను వేడుకున్నారు. సాయి చైతన్య ఇంటి నుండి వెళుతూ రాసిన ఉత్తరాన్ని, వీడియో కాపీని పోలీసులకు అప్పగించినట్లు సాయి చైతన్య తల్లి ఏబీఎన్‌కు వివరించారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top