ఇద్ద‌రు యువతులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. త‌రువాత ఏమైందో తెలుసా..?

స్వ‌లింగ సంప‌ర్కం అనేది మ‌న దేశంలో చ‌ట్ట‌రీత్యా నేరం. కానీ కొన్ని దేశాల్లో దీన్ని ఆమోదించారు కూడా. ఇక కొన్ని దేశాల్లో స్వ‌లింగ సంపర్కం చేయ‌డం తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో ఉంటున్న స్వ‌లింగ సంప‌ర్కులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతున్నారు. దీంతో మ‌న దేశంలోనూ ఈ విష‌య‌మై పున‌రాలోచ‌న చేయాల‌ని సుప్రీం కోర్టు ఎన్న‌డో కేంద్రానికి చెప్పింది. కానీ కేంద్రం ఆ విష‌యాన్ని పక్క‌న పెట్టేసింది. అది వేరే విష‌యం. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన సంఘ‌ట‌న ఏమిటంటే…

అది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం. అక్క‌డ ఓ ప్రాంతంలో నివాసం ఉండే రెండు ఇద్ద‌రు యువతులు ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నారు. రోజూ క‌లివిడిగా తిరిగేవారు. ఈ క్ర‌మంలో వారిని చూసి ఎవ‌రినీ అనుమానం కూడా రాలేదు. అయితే ఆ ఇద్ద‌రు యువ‌తులు స్వ‌లింగ సంప‌ర్కులు. దీంతో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. కానీ అది మ‌న దేశంలో చెల్ల‌దు క‌దా. దీంతో వారు ఏం చేశారంటే.. వారిద్ద‌రిలో ఓ యువ‌తి మ‌గ అవ‌తారం ఎత్తింది. కార్తీక్ శుక్లా అని పేరు మార్చుకుని త‌ప్పుడు ధృవ‌ప‌త్రాల‌ను కూడా ఆ పేరిట త‌యారు చేసింది. అనంత‌రం ఇద్ద‌రూ పెళ్లికి ప్లాన్ చేశారు.

అలా కార్తీక్ శుక్లాగా పురుష అవతారం ఎత్తిన యువ‌తి తనకు న‌కిలీ తల్లిదండ్రుల‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. అనంత‌రం ఇద్దరు యువ‌తుల పెళ్లి జ‌రిగిపోయింది. వ‌ధువు త‌ర‌ఫు కుటుంబానికి మొద‌ట ఎలాంటి అనుమానం రాలేదు. కానీ పెళ్ల‌య్యాక వ‌రుడి వేషంలో ఉన్న‌ది యువ‌తి అని తెలిసింది. దీంతో వారు వ‌రుడి వేషంలో ఉన్న ఆ యువ‌తిని చిత‌క‌బాదారు. అయితే విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌డంతో ఏం చేయాలో తెలియని మ‌రో యువ‌తి (వ‌ధువు) భ‌వ‌నం పై నుంచి కింద‌కు దూకింది. కానీ అది పెద్ద‌గా ఎత్తు లేక‌పోవ‌డంతో ఆమె గాయాల‌తో బ‌య‌ట ప‌డింది. చివ‌ర‌కు పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గొడ‌వను స‌ద్దు మ‌ణిగేలా చేశారు. ఈ క్ర‌మంలో వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఏది ఏమైనా… ఈ పెళ్లి షాకింగ్‌గా ఉంది క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top