ప్రేమతో పీచుమిఠాయ్…ప్రేమకు మరణం లేదంటూ అసలైన ప్రేమను నిర్వచించిన షార్ట్ ఫిల్మ్.!

జీవితమే తనదైనప్పుడు ఎన్నిరోజులైతే ఏంటి? ఎన్ని సంవత్సరాలైతే ఏంటి? అంటూ ట్రూ లవ్ ను గురించి చెప్పిన  అసలు సిసలు ప్రేమ కథే  ‘ప్రేమతో  పీచుమిఠాయ్’. కథ పరంగా చూస్తే.. ఒక అబ్బాయి చాలా రోజులుగా ఒక అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. తనని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసు. కానీ ఇద్దరు మాట్లాడుకోరు. ఆ అబ్బాయి ఈరోజు కాకపోతే, ఇంకొన్ని రోజులకైనా తన ప్రేమ విషయం చెబుతాడని ఎదురుచూస్తుందామె., కానీ మనోడికి  ఆమె ఎదురుపడగానే నోటి నుండి మాటరాదు. ఒకరోజు తన స్నేహితులు ధైర్యం చెప్పడంతో భారీ సెట్టింగ్స్ వేసి తన ప్రేమ విషయం చెప్పడానికి వెళతాడు. మళ్ళీ ఆమె ఎదురవ్వగానే లైబ్రరీలో కూర్చున్న వ్యక్తిలా సైలెంట్ అయిపోతాడు. ఇక ఇలా కుదరదని సాయంత్రం 5 గంటలకు ఇదే స్పాట్ కు రమ్మని ఆ అబ్బాయికి చెబుతుంది ఆమె. సాయంత్రం ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు తను క్లాస్ పీకుతుంటే అతడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటున్న ఆమె కార్ యాక్సిడెంట్ కు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది?వారి ప్రేమ గెలిచిందా?లేదా? అనేది ఈ షార్ట్ ఫిల్మ్.

ఆకట్టుకున్న డైలాగ్స్:
  •  ఆ అమ్మాయిని చూస్తుంటే  నా మాటలు కూడా, నా మాటలు వినడం లేదు.
  • గుండుసూది తగిలి గూడ్స్ బండి ఆగిపోయినట్లు ఆగిపోతున్నాను తనని చూడగానే….!
  • జీవితమే తనదైనప్పుడు ఎన్నిరోజులైతే ఏంటి? ఎన్ని సంవత్సరాలైతే ఏంటి??

ఆకట్టుకున్న ఇతర అంశాలు:

  •  సింపుల్ కాన్సెప్ట్ తో, తక్కువ బడ్జెట్.
  •  అక్కడక్కడా స్లో అయినా , విజువల్ గా చూడటానికి చాలా బాగుంది.
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
  • సినిమా కోసం ఎంచుకున్న లోకేషన్స్

Watch PREMATHO PEECHUMITTAI Short Film:

 

Comments

comments

Share this post

scroll to top