ఇది "నాన్నకు ప్రేమతో" కాదు.. "ప్రేమతో నాన్నకు"…నిజంగా ఓ సందేశాత్మకం.

‘మనం బాగుండాలంటే మనతో పాటు ఉండే సమాజం కూడా బాగుండటం.. సమాజం బాగుండాలంటే మన కుటుంబం ఆనందంగా ఉండాలని’ చెప్పే చిన్ని ప్రయత్నమే ఈ ‘ ప్రేమతో నాన్నకు’ చిత్రం.ఒక చిన్న కుటుంబం, ఆ కుటుంబంలో ఒక భర్త, భార్య, వారి ఇద్దరు పిల్లలు. అర్ధరాత్రి అక్క, తమ్ముడు కలిసి బయటకు వెళ్లారు. పిల్లలకోసం పేరెంట్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. రోడ్ పై తమకు ఎదురైన ఒక ప్రమాదాన్ని తప్పించుకొని ఇంటికి చేరారు. ఇంటికి చేరగానే తండ్రి తన కూతురిపై చేయిచేసుకున్నాడు. చెప్పా పెట్టకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారని. లోపలికి సముదాయించిన తల్లి, నాన్న పుట్టినరోజని ఇష్టమైన సిగరెట్ తీసుకురావడానికి వెళ్లామని సమాధానమిచ్చింది. ఆ తండ్రి సిగరెట్ స్మోకర్.

తండ్రిపై ప్రేమ ఉన్న ఆ చిన్నారి తండ్రి ఇష్టపడ్డ సిగరెట్ తీసుకువచ్చింది. తను ఏం చేస్తున్నానో ఆలోచించిన ఆ తండ్రి ఆ క్షణంలో సిగరెట్ తాగడం వదిలేశాడు. ఆనందకరమైన కుటుంబాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే ధూమపానానికి దూరంగా ఉందామని మన కుటుంబాన్ని, సమాజాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వాయిస్ ఓవర్ అందించి ప్రేమకు నాన్నతో చిత్రంలో భాగమయ్యారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top