నాగచైతన్య ప్రేమమ్ సినిమా రివ్యూ ( తెలుగులో…….)

Cast & Crew:

 • హీరోహీరోయిన్స్ : నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్
 • దర్శకత్వం : చందూ మొండేటి
 • సంగీతం : గోపిసుందర్
 • నిర్మాత : ఎస్ రాధాకృష్ణ, పిడివి ప్రసాద్, ఎస్ నాగవంశీ
 • స్పెషల్ అపియరెన్స్: వెంకటేష్, నాగార్జున.

Story:
మొదటి ప్రేమకథ: ప్రెండ్స్ తో జాలీగా తిరిగే విక్రమ్(నాగచైతన్య) పదోతరగతి చదువుతున్న అమ్మాయి సుమ(అనుపమా పరమేశ్వరన్)ను ఇష్టపడతాడు. అటునుండి కూడా కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. తన లవ్ సక్సెస్ అనుకుంటున్న విక్రమ్ కు షాక్ ఇస్తుంది సుమ…సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ ను విక్రమ్ కు పరిచయం చేస్తుంది.

రెండో ప్రేమకథ: ఇంజనీరింగ్ చదువుతున్న విక్రమ్ …తన ఫ్రెండ్స్ తో ఓ గ్యాంగ్ మెయింటేన్ చేస్తుంటాడు. అదే కాలేజ్ కు లెక్చరర్ గా వస్తుంది సితార (శృతిహాసన్), తనను చూడగానే ఇష్టపడతాడు విక్రమ్… విక్రమ్, సితారా ల మధ్య ఫోన్లు, ఛాటింగ్ లు, మీటింగ్స్ అవుతుంటాయి. ఈ లవ్ సక్సెస్ అనుకుంటున్న తరుణంలో కాలేజ్ కు సెమిస్టర్ హాలిడేస్ వస్తాయి, అదే సమయంలో పూనేకు వెళ్ళిన సితారా యాక్సిడెంట్ లో తన గతం మర్చిపోతుంది.

మూడో ప్రేమకథ: ఇంజనీరింగ్ తర్వాత  యస్ రెస్టో…పేరుతో ఓ రెస్టారెంట్ ను నడుపుతున్న విక్రమ్ కు తన చిన్ననాటి స్నేహితురాలు సింధు( మడోనా సెబాస్టియన్) కనిపిస్తుంది.మళ్లీ ఆమెను లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు విక్రమ్…..చివరకు ఈ లవ్ అయినా సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.

ప్లస్ పాయింట్స్ :

 • నాగచైతన్య నటన,మూడు పాత్రలకు తగ్గట్టు వేరియేషన్స్.
 • కథ
 • సంగీతం, BGM
 • కామెడీ.

మైనస్ పాయింట్స్ :

 • కొన్ని అనవసర సీన్లు.
 • సెకండ్ హాఫ్ లెంగ్త్

మిస్ కాకూడని సీన్స్:

 • వెంకీ ఎంట్రీ సీన్.
 • శృతిడాన్స్ సీన్.
 • ఎవరే సాంగ్.

Verdict:  ప్రేమమ్…ఇది అంతా ప్రేమమయం..అటు ఇటుగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీసే.!
Rating: 3/5
Trailer:

Comments

comments

Share this post

scroll to top