ఈ వ‌స్తువుల‌ను ఇంట్లో పెట్టుకుంటే.. గ‌ర్భిణీలు ఆరోగ్య‌వంత‌మైన, చ‌క్క‌ని పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తార‌ట తెలుసా..?

ఆరోగ్య‌వంత‌మైన పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వాల‌ని ప్ర‌తి త‌ల్లికి ఉంటుంది. పుట్టుక‌తోనే బిడ్డ అనారోగ్యంగా ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా. ఈ క్ర‌మంలోనే గ‌ర్భంతో ఉన్న ఏ మ‌హిళ అయినా మంచి ఆరోగ్య‌వంత‌మైన బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నివ్వాల‌ని చూస్తుంది. అందులో భాగంగానే చ‌క్క‌ని ఆహారం కూడా తీసుకుంటారు. మంచి పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ అవ‌స‌రం ఉన్న మందుల‌ను కూడా వాడుతారు. అయితే వాటితోపాటు ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప‌లు వ‌స్తువుల‌ను కూడా గ‌ర్భిణీలు త‌మ గ‌దిలో పెట్టుకుంటే దాంతో వారి చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుందట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం పిల్ల‌లు కూడా చ‌క్క‌గా పుడ‌తార‌ట‌. మ‌రి గ‌ర్భిణీలు త‌మ త‌మ గదుల్లో పెట్టుకోవాల్సిన ఆ వ‌స్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ప‌సుపు బియ్యం
హిందువులు బియ్యానికి అధిక ప్రాధ‌న్య‌త‌నిస్తారు. అది కూడా శుభ కార్యాల్లో. పెళ్లిళ్ల‌లో ప‌సుపు క‌లిపిన బియ్యాన్ని వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ తలంబ్రాల రూపంలో మీద పోసుకుంటారు. అదే బియ్యాన్ని అక్షింత‌ల రూపంలో వ‌ధూవ‌రుల‌పై వేసి ఆశీర్వ‌దిస్తారు. అలాంటి ప‌సుపు క‌లిపిన బియ్యాన్ని గ‌ర్భిణీలు త‌మ గ‌దిలో ఓ పాత్ర‌లో పెట్టుకోవాలి. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంది. దుష్ట శ‌క్తుల ప్ర‌భావం ఉండ‌దు. పుట్టబోయే పిల్ల‌లు ఆరోగ్యంగా పుడ‌తారు.

2. పింక్ షోపీస్
పింక్ క‌ల‌ర్‌ను సంతోషానికి, ఉత్సాహానికి గుర్తుగా చాలా మంది భావిస్తారు. క‌నుక‌నే అదే రంగులో ఉండే షోపీస్ లేదా వాల్ పోస్ట‌ర్‌ను రూంలో పెట్టుకోవాలి. దీంతో వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. త‌ద్వారా ఆరోగ్య‌వంత‌మైన పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌వచ్చు.

3. శ్రీ‌కృష్ణుడు, య‌శోద
యశోద శ్రీ‌కృష్ణున్ని ఎత్తుకున్న‌ట్టుగా ఉండే ఫొటోను గోడ‌పై పెట్టుకోవాలి. ఉద‌యాన్నే లేవ‌గానే ముందుగా గ‌ర్భిణీలు ఈ పోస్ట‌ర్‌నే చూడాలి. దీంతో చ‌క్క‌ని పిల్ల‌లు పుడ‌తారు.

4. వాస్తు దేవుడు
వాస్తు దేవుడికి చెందిన ఓ ఫొటోను ఇంట్లో గోడ‌కు పెట్టాలి. ఉద‌యం లేవ‌గానే ఈ ఫొటోను చూసినా చాలు, అంతా శుభ‌మే క‌లుగుతుంది. వాస్తు దోషం పోతుంది. చ‌క్క‌ని సంతానం క‌లుగుతారు. నెగెటివ్ ఎన‌ర్జీ అంతా పోతుంది.

5. ఇత్తడి వ‌స్తువు
వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని పోగొట్టే శ‌క్తి ఇత్త‌డి వ‌స్తువుల‌కు ఉంటుంద‌ట‌. ఇవి నెగెటివ్ ఎన‌ర్జీని గ్ర‌హిస్తాయ‌ట‌. క‌నుక గ‌ర్భిణీలు ఇత్త‌డి వ‌స్తువుల‌ను గ‌దుల్లో పెట్టుకుంటే దాంతో నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఇది చ‌క్కని సంతానం క‌లిగేలా చేస్తుంది.

6. నెమ‌లి ఈక‌లు
నెమ‌లి ఈక‌లు ఇంట్లో ఉంటే చాలా అదృష్ట‌మ‌ట‌. ఇక గ‌ర్భిణీలు వాటిని త‌మ గ‌దిలో పెట్టుకుంటే దాంతో అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట‌. ఆరోగ్యవంత‌మైన పిల్ల‌లు పుడ‌తార‌ట‌.

7. వైట్ షో పీస్
తెలుపు రంగులో ఉండే ఏదైనా షోపీస్ (అలంక‌ర‌ణ వ‌స్తువు)ను గ‌దిలో పెట్టుకున్నా చాలు. దాంతో గ‌ర్భిణీలు ఆరోగ్య‌వంత‌మైన పిల్ల‌లను కంటార‌ట‌.

8. మొక్క‌లు, పూలు
తాజా మొక్క‌లు, పూల‌ను గ‌ర్భిణీలు త‌మ రూమ్‌ల‌లో పెట్టుకోవాలి. వాటి నుంచి వ‌చ్చే పాజిటివ్ ఎన‌ర్జీ క‌డుపులో ఉండే బిడ్డ‌కు మంచిది. దీంతో వారు ఆరోగ్యంగా పుడ‌తారు.

Comments

comments

Share this post

scroll to top