బాలింతల‌కు 6000 ఆర్థిక స‌హాయం.! కేంద్ర కేబినేట్ ఆమోదం.!!

బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా మొత్తం నాలుగు విడ‌త‌ల్లో గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌ అకౌంట్లో మొత్తం 6 వేల రూపాయ‌లు జ‌మా అవుతాయి.

  • గర్భిణిగా పేరు నమోదు చేసుకున్నాక తొలివిడతగా రూ.1000.
  • గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత కనీసం ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాక మరో రూ.2000.
  • శిశువు పుట్టిన తర్వాత ఆ వివరాలు నమోదు చేయించి, తొలివిడత బీసీజీ, పోలియో వ్యాక్సిన్‌ (ఓపీవీ), డీపీటీ, హెపటైటిస్‌-బి వంటి టీకాలను శిశువుకు వేయించిన తర్వాత రూ.2000 .
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్నవారికి ప్రస్తుత మాతృత్వ లబ్ధి పథకం కింద‌ రూ.1000 .

వీరికి వ‌ర్తించ‌దు.

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారు, ఇతరత్రా ఏదైనా చట్టాల ద్వారా ఇలాంటి లబ్ధి పొందుతున్నవారికి ఈ పథకం వర్తించదు.
  • ఈ ప‌థ‌కం మొద‌టి కాన్పుకే వ‌ర్తిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top