గ‌ర్భిణీలు బొప్పాయి పండు తిన‌కూడ‌దా ? తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

బొప్పాయి పండు తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి. ర‌క్తం పెరుగుతుంది. డెంగీ విష జ్వ‌రం సోకిన వారికి దీన్ని తినిపిస్తే త్వ‌ర‌గా కోలుకుంటారు. అయితే ఇదంతా స‌రే… ఎప్ప‌టి నుంచో బొప్పాయి పండు ప‌ట్ల మ‌న‌లో ఒక సందేహం నెల‌కొని ఉంది. అదేనండీ.. గ‌ర్భిణీలు బొప్పాయి పండు తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుంది ? గ‌ర్భ‌స్రావం అవుతుందా ? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మ‌రి ఈ విష‌యాల్లో నిజం ఎంత ఉంది, అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

గ‌ర్భం దాల్చిన వారు బొప్పాయి పండు తిన‌వ‌ద్ద‌ని ఇంట్లో పెద్ద‌లు చెబుతుంటారు. గ‌ర్భ‌వతులు ఈ పండును తింటే గ‌ర్భ‌స్రావం అవుతుంద‌ని అంటారు. అయితే ఇది అపోహేన‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దీన్ని మేం చెప్ప‌డం లేదు. సాక్షాత్తూ వైద్యులే చెబుతున్నారు. బొప్పాయి పండును తిన‌డం వ‌ల్ల గ‌ర్భిణీలకు ఏమీ కాద‌ట‌. గ‌ర్భ‌స్రావం అవుతుంద‌నే మాట ఉత్త అపోహేన‌ని వైద్యులు చెబుతున్నారు. నిజానికి గ‌ర్భ‌వతులు బొప్పాయి పండు తిన‌డం వ‌ల్ల చాలా మేలు క‌లుగుతుంద‌ని డాక్ట‌ర్లు అంటున్నారు.

గ‌ర్భిణీలు బొప్పాయి పండును తింటే క‌డుపులో ఉన్న బిడ్డ‌కు అవ‌స‌ర‌మ‌య్యే కీల‌క విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అందుతాయి. దీంతో బిడ్డ ఎదుగుద‌ల బాగుంటుంది. బిడ్డ‌కు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. గ‌ర్భిణీల‌కు కూడా బొప్పాయి పండును తింటే శ‌క్తి ల‌భిస్తుంది. అయితే గ‌ర్భిణీలు ఈ పండును తింటే కొంత జాగ్ర‌త్త ప‌డాలి. ఎందుకంటే బొప్పాయి పండును ప‌చ్చిదాన్ని తిన‌రాదు. ఎందుకంటే అందులో ప‌పాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గ‌ర్భ సంచిని ముడుచుకుపోయేట్టు చేస్తుంది. క‌నుక బొప్పాయి పండును ప‌చ్చిదాన్ని తినరాదు. బాగా పండిన బొప్పాయినే తినాల్సి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top