నెల తప్పిందని టెన్త్ క్లాస్ బాలికకు T.C ఇచ్చి పంపించారు. రిపోర్ట్ తప్పని తెలిసి బిత్తరపోయారు.

 

రెండు నెలలుగా  రుతుస్రావం జరగట్లేదన్నందుకు..రెండు టెస్ట్ లు చేయించి… నెల తప్పిందని 10 వ తరగతి చదువుతున్న బాలికకు TC ఇచ్చి పంపిచించారు ఉపాధ్యాయులు.  ఈ ఘటన కడపలోని కస్తూర్భా  మైనార్టీ స్కూల్ లో జరిగింది. నెలసరి సరిగ్గా రావడం లేదని స్కూల్ నర్స్ కు తెలిపిన సదరు టెన్త్ క్లాస్  అమ్మాయికి  ప్రెగెన్సీ  టెస్ట్ లు చేయించి ..నెల తప్పిందన్న రిపోర్టను చూసి,  వారి తల్లీదండ్రులను పిలిపించి  TC ఇచ్చి పంపించారు స్కూల్ నిర్వాహకులు.

 

 

తల్లీదండ్రులు  బాలికను  నిలదీయడంతో… తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది ఆ అమ్మాయి. దీంతో అనుమానం వచ్చిన పేరెంట్స్ మారో మారు ఆ అమ్మాయికి ప్రెగెన్సీ టెస్ట్ చేయించారు. ఈ రిపోర్ట్ అంతా నార్మల్ గా వచ్చింది. అసలు ప్రెగెన్సీ తాలూకు లక్షణాలు కూడా లేవని తెలిపారు డాక్టర్లు. ఈ రిపోర్ట్స్ ను పట్టుకొని స్కూల్ వెళితే… నీళ్లు నమిలారు నిర్వాహకులు.  ఎలాంటి తప్పు చేయని తమ కూతురి మీద ఇంత పెద్ద నింద మోపారని విలపించారు తల్లీదండ్రులు. రిపోర్ట్స్ చూశాకే  పాఠశాలకు చెడ్డపేరు రాకూడదని ఇలా చేశాం. ఇప్పుడు  బాలికను తిరిగి పాఠశాలలో చేర్చుకుంటామని స్కూల్ ఇంచార్జ్  తెలిపారు.

girl in dipression

ఇప్పుడు ఇక్కడ రేజ్ అయ్యే ప్రశ్నలు రెండే రెండు…..

రిపోర్ట్స్ ఎందుకు తప్పుగా వచ్చాయ్…? ఆ అమ్మాయి పై వేసిన మచ్చకు బాధ్యెవరు?

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top