ఆ పేద బాలుడికి అరుదైన వ్యాధి…ఒకే ఒక్క డాక్టర్ మాత్రమే వైద్యం చేయగలడు!.కానీ అతని ఫీజు చాలా ఎక్కువ

అది రాత్రి 9 గంటల సమయం…ఓ డాక్టర్ హైదరాబాద్ లోని హాస్పిటల్ నుండి అప్పుడే ఇంటికి వచ్చారు…రిలాక్స్ అవుదాము అని సోఫా లో కూర్చున్నారు…ఇంతలో అతనిని ఆశ్చర్యానికి గురి చేసిన ఒక ఫోన్ కాల్ వచ్చింది…ఫోన్ పెట్టేసిన వెంటనే ఆనందంతో గంతులేసేంత పని చేసారు డాక్టర్…ఇంతకీ ఫోన్ లో ఏం న్యూస్ విన్నారు అనుకుంటున్నారా?..డాక్టర్ కి బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది అంట…రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు…కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది..అతనికి అవార్డు ఇచ్చేది ఆ మరుసటి రోజే అట..అది కూడా ముఖ్యమంత్రి గారి ముందు “విశాఖపట్నం”లో…అప్పటికే రాత్రి 12 అయ్యింది…రేపు సాయంత్రం 4 గంటలకల్లా “వైజాగ్” లో ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటూ ఉన్నారు ఆ డాక్టర్..

వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి…ఉదయాన్నే విశాఖపట్నం కి ఒక విమానం ఉందని తెలుసుకొని టికెట్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు…కానీ విమానం అనుకున్న టైం కంటే ఆలస్యంగా వస్తుంది…సమయానికి చేరుకోవచ్చులే అనుకుంటూ విమానం ఎక్కేస్తారు ఆ డాక్టర్..ఇంతలో దురదృష్టం కొద్దీ వాతావరణం అనుకూలించక “విమానం” ని విశాఖపట్నం లో దించకుండా  “రాజమండ్రి” లోనే దించేస్తారు…అక్కడినుండి అతను “విశాఖపట్నం” వెళ్ళాలి అంటే అర్జెంటు గా బయటకి వెళ్ళి టాక్సీ పట్టుకోవడమే ఉత్తమం…అదే విధంగా టాక్సీ ఎక్కుతాడు…షార్ట్ కట్ ఏదైనా ఉంటే అటు తీసుకెళ్ళు అని చెప్తాడు కార్ డ్రైవర్ కి…ఇంతలో ఒక దగ్గర తప్పు దారిలో తీసుకెళ్లిపోతాడు డ్రైవర్..అప్పటికే సమయం 4 దాటిపోతుంది…ఇక చేసేది ఏమి లేక డాక్టర్ నిరాశతో ఉంటాడు..అప్పుడే అతనికి ఉదయం నుండి ఏమి తినలేదని గుర్తొస్తుంది…పర్సులో డబ్బులు చాలా ఉన్నాయి..కానీ తినడానికి ఏమి దొరకట్లేదు ఆ ప్రదేశంలో…అసలే ఆ ప్రదేశం మొత్తం దట్టమైన అడవిలా ఉంది…ఇంతలో వారికొక పాత ఇల్లు ఒకటి కనిపిస్తుంది…అక్కడికి వెళ్ళి తలుపు తడతారు!

తలుపు తీసి ఓ మహిళ “ఎవరు మీరు? ఏం కావలి” అని అడుగుతుంది…ఇంతలో ఆమెని వీరు దారి మర్చిపోయి వచ్చారు అని అర్థం చేసుకొని…లోపలికి రండి అని పిలిచి మంచి నీళ్లు, టీ ఇస్తుంది…ఇంతలో మీరు ఎవరు అని అడుగుతుంది ఆ మహిళ…దయచేసి మేము ఏం చెప్పే పరిస్థితిలో లేము…ముందుగా ఆహారంగా ఏమైనా పెట్టండి …తరవాత అన్ని చెపుతాను అంటారు ఆ డాక్టర్…అయితే ఆ మహిళ “ఇది నేను ప్రార్ధన చేసుకునే సమయం..దయచేసి కొద్దిసేపు వేచి ఉండండి” అంటుంది..ప్రార్ధన మీద నాకు నమ్మకం లేదు మీరు త్వరగా ప్రార్ధన పూర్తిచేసి మాకు ఆహరం ఏదైనా పెట్టండి ఈ లోపు నేను ఇల్లు చూస్తా అని అటు ఇటు తిరుగుతాడు ఆ డాక్టర్…

ఇంతలో పక్కన ఒక రూంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక పిల్లోడిని చూస్తాడు ఆ డాక్టర్…ఇంతలో ప్రార్ధన ముగించుకొని డాక్టర్ కి అన్నం వడ్డిస్తుంది ఆ మహిళ…భోజనం చేస్తూ మంచం మీద ఉన్న ఆ పిల్లోడి గురించి అడుగుతాడు ఆ డాక్టర్…

“ఆ పిల్లోడు నా కొడుకు చిన్నప్పటినుండి ఎదో గుండెజబ్బుతో ఇబ్బంది పడుతున్నాడు”… అని చెపుతుంది ఆ మహిళ…

“మరి మంచి డాక్టర్ కి చూపించచ్చు కదా” అని అంటారు ఆ డాక్టర్…

“ఎంతో మందికి చూపించాను..ఎవరు నయం చేయలేకపోయారు…కేవలం హైదరాబాద్ లో ఒకే ఒక్క డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆరోగ్యం నయం అవుతుంది అంట…కానీ ఆయన ఫీజు చాలా ఎక్కువ…నేను ఇల్లు అమ్మినా కానీ చికిత్స చేయించలేను”… అంటుంది ఆ మహిళ…

ఇంతలో డాక్టర్ కన్నీరు పెట్టుకొని…హైదరాబాద్ లో ఈ వ్యాధికి చికిత్స చేసే స్పెషలిస్ట్ నేనే చెప్పి…ఆ బాలుడికి ఉచితంగా వైద్యం చేసి ప్రాణాలు కాపాడుతాడు..అప్పటినుండి పేద పిల్లలకు ఉచితంగా చికిత్స చేయాలి అని నిర్ణయించుకుంటాడు ఆ డాక్టర్!

భగవంతుడికి నీకోసం ప్రార్ధన చేస్తే కరుణిస్తాడో లేదో తెలియదు కానీ ఇతరులకు ప్రార్థిస్తే తప్పక సాయం చేస్తాడు…ఆమె నమ్మిన భగవంతుడే ఆ డాక్టర్ దారి మరిలేలా చేసి చివరకు డాక్టర్ ను మార్చేలా చేసాడు

Comments

comments

Share this post

scroll to top