“హిమాయత్నగర్ నుండి కేర్ హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలో 3 సార్లు ప్రత్యూషను రేప్ చేసారు.!” – ప్రత్యూష తల్లి!

ఆడపిల్లలపై హత్యా ,అత్యాఛారం లాంటి ఘటనలు టీవిల్లో చూసినప్పుడు లేదంటే పేపర్లో చదివినప్పుడు అయ్యో అంటాం కానీ ఒకసారి ఒకే ఒకసారి వారి కుటుంబ సభ్యుల స్థానంలో ఉండి ఆలోచిస్తే ఒక క్షణంపాటు ఆ ఆలోచనే భరించలేం..అలాంటిది ఆ కుటుంబ సభ్యులు ఆ వేదన నుండి బయట పడాలంటే ఎంత ధైర్యం కావాలి..దేవుడు మనిషుకిచ్చిన గొప్ప వరం మర్చిపోవడం అనే మాట అప్పుడప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది .మరుపనేదే లేకపోతే జరిగిన సంఘటన దగ్గరే వారి జీవితం ఆగిపోతే ఆ పరిస్థితి ఎంత దుర్బరంగా ఉంటుంది..ఒక ఘటన జరిగి ఒక మనిషి పోతే అది ఆ ఒక్క మనిషితో పోదు..ఆ కుటుంబం మొత్తంపై ఆ ఘటన ప్రభావం పడుతుంది..అంతేకాదు సమాజంలో కొంతమందిని ఆలోచింపచేస్తుంది.కొంతమందిని భయకంపితులను చేస్తుంది..అలాంటి ఘటనే సిని నటీ ప్రత్యూష మరణం..అది హత్యో ఆత్మహత్యో ఇప్పటికీ ప్రశ్నార్ధకమే….

నల్గొండ లోని భువనగిరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. తండ్రి లేడు ,తల్లి ప్రభుత్వ ఉపాద్యాయురాలు..స్కూల్ ఏ జ్ లోనే పరిచయం ఉన్న వ్యక్తితో ప్రేమ.. మిస్ స్మైల్ అవార్డు అందుకున్న అమ్మాయి పదిహేడేళ్లకే  సినీరంగ ప్రవేశం.కూతురు క్యారెక్టర్ నుండి చెల్లెలు క్యారెక్టర్ మెల్లిగా సినిమా హీరోయిన్ అవకాశాలు..ఒక్కోక్క మెట్టుగా ఎదుగుతుండడం ఒకవైపు..మరో వైపు స్కూల్ డేస్ లోని ప్రేమాయణంలో వచ్చిన కలతలు అన్ని కలిసి ప్రత్యూష మరణానికి దారి తీసాయి..చట్టం దృష్టిలో ప్రత్యూషది ఆత్మహత్య..కానీ నిజం ఏంటో అందరికి తెలుసు..పత్రిక లు రాసాయి..టీవి ఛానళ్లు కోడై కూసాయి.మహిళా సంఘాలు గొంతెత్తాయి..కానీ ఒక ఆడపిల్లకు మాత్రం న్యాయం చేయలేకపోయాయి.. డబ్బు అధికారం ముందు ఒంటరైన తల్లి పోరాటం తన కూతురు చావుని ఆత్మహత్యగా కొట్టిపారేస్తుంటే నిస్సహాయంగా చూస్తుండడం తప్ప ఏం చేయలేకపోయాయి..ఆ ఘటన జరిగిన తర్వాత వారింట్లో పరిస్థితి,అసలు సిద్దార్ద రెడ్డితో ప్రత్యూష పరిచయం ,వారి మధ్య కలతలు రావడానికి గల కారణాలు మొత్తం అన్నింటిని ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఇటీవల ఒక ఇంటర్యూలో పంచుకున్నారు..కూతురి మరణం అప్పుడు ఆ తల్లి ఎంతటి కడుపుకోత అనుభవించిందో,ఇప్పటికీ అనుభవిస్తుందో ఆమె మాటలు వింటే మనకి కూడా ఏడుపొచ్చేస్తుంది..నిజంగా ఆడపిల్లకు రక్షణ ఏది..యత్రనార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతా అనే మన దేశంలో ఒక ప్రత్యూష,ఒక అయేషా,ఒక నిర్భయ ..ఇలాంటి ఘటనలకు అంతమెప్పుడో….

watch video here:

Comments

comments

Share this post

scroll to top