అప్పుడు సీఎం కెసిఆర్ దత్తపుత్రిక..! కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందో తెలుసా..?

అభం శుభం తెలియని వయస్సులో సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురైన చిట్టి తల్లికి, ఓ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిని తండ్రిగా చేసిన  విధి… ఎంత విచిత్రమైనది. సాక్షాత్తు న్యాయదేవత సాక్షిగా జరిగిన ఈ ఘట్టానికి మనమంతా సాక్ష్యాలం… అవును  ఆ  మానవత్వపు పరిమళాలు ఇంకా రాష్ట్ర ప్రజల నాసికాలను తాకుతూనే ఉన్నాయ్. ఆ పాప బాధ్యతను  సిఎం సారూ తీసుకున్నారా..? అంటూ  ఆశ్చర్యం, ఆనందం మిళితమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్నారు రాష్ట్ర ప్రజలు.

వరుస కాన్వాయ్ కార్లలో రెడ్ లైట్ల వెలుగులో రయ్ మంటూ దూసుకుపోయే పదవి అది, క్షణం తీరిక లేకుండా పాలసీల పనిపట్టే పోస్ట్ అది.. అటువంటి ఆయనే… ప్రత్యూష పరిస్థితి చూసి చలించిపోయారు. సినిమా క్లైమాక్స్ లో గాని చూడలేని ఘట్టాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు. నా ఇంటికి పదమ్మా, కన్న బిడ్డలాగా చూసుకుంటా అంటూ హమీ ఇచ్చారు. చదువు చెప్పించే బాధ్యత నాదే అంటూ భరోసా ఇచ్చారు. రెండేళ్ల క్రితం సీఎం గారు ఇలా మాటిచ్చారు. మరిప్పుడు ఏమైంది..?

సీఎం గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..? ఇప్పుడు ప్రత్యూష ఎలా ఉంది..?

రెండేళ్ల క్రితం సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురై సీఎం కేసీఆర్‌ చొరవతో బయటపడ్డ ప్రత్యూష ఇప్పుడు నర్సింగ్‌ కోర్సు చేస్తోంది. ఆనాడు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రత్యుషను సీఎం కేసీఆర్ పరామర్శించి, అక్కున చేర్చుకున్నారు. దత్తపుత్రికగా ప్రకటించారు. ప్రభుత్వం తరుపునే విద్య, వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆమె కోరుకున్న విధంగా చదివిస్తున్నారు.


ఈనాడు ఆమె నర్సింగ్‌ కోర్సు చేస్తోందన్న సమాచారాన్ని అధికారులు మంగళవారం సీఎంకు వివరించగా ఆయన ఆనందం వ్యక్తంచేశారు. కష్టపడాలన్న తపన ఉంటే ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయని నిరూపించింది ప్రత్యూష. హాట్స్ ఆఫ్ సిస్టర్..!

Comments

comments

Share this post

scroll to top