‘ప్రశాంత’మైన జీవితం లో అలజడి – PART2

Part 1 : https://telugu.ap2tg.com/prashanthamaina-jeevitham-part1/

Part 1 continuation… తనకు ప్రొపోజ్ చేద్దాం అని తన రాక కోసం వేచి చూస్తూ ఉన్నా…

తను పొద్దున 5 గంటలకు వచ్చింది, 10 రోజుల తరువాత తనని చూసా, బస్ స్టాండ్ కి వెళ్లి తనని పిలుచుకుని వచ్చా, ఏదో తెలియని అనుభూతి, నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా బండి మీద ఉందంటే ఏదో తెలియని అనుభూతి.

తను తన రూమ్ లోకి వెళ్లి పడుకుంది, పొద్దున్నే 10 గంటలకు లేసింది, తన రూమ్ బైటనే వెయిట్ చేస్తూ ఉన్నా, తను బైటికి వచ్చిన వెంటనే, మధ్యాహ్నం లంచ్ చెయ్యడానికి వెళదాం అని చెప్పాను, తను సరే అనింది. ఇంటికి వెళ్లి అరగంట సేపు స్నానం చేశా, బాగా రెడీ అయ్యా. మధ్యాహ్నం 12 కాగానే, తను కిందికి వచ్చింది. ఎన్నడూ లేనిది మొదటి సారి చీర కట్టుకుంది తను, చీరలో తన అందాన్ని చూసాక తన అందం ముందు నేను చిన్నబోయా.

దేవుడి ముందర.. :

గుడికి వెళ్లి అటునుంచి అటు తినడానికి వెళదాం అని నాతో చెప్పింది, సరే అని గుడికి తీసుకువెళ్లా, దర్శనం అయ్యాక ఒక చోట కూర్చున్నాం. ‘పొద్దున బస్ స్టాండ్ కి వచ్చినప్పటి నుండి చూస్తున్నా, కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నావ్ ఇవ్వాళ, ఏమైంది అసలు అని’ తను నన్ను అడిగింది. దేవుడి ముందర చెప్పడమే భావ్యం అనుకున్నా. అనుకున్నదే ఆలస్యం, ‘నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అని చెప్పా తనతో.

ఓ మై జబర్దస్త్.. :

ఏమైందో ఏంటో తెలీదు, తను పడి పడి నవ్వింది, దేవుడి ముందు కామెడీ చేస్తావ్ ఏంటి అని తను నాతో అనింది, ఆ మాట విన్నాక నాకు బాధ పడాలో కోప్పడలో అర్ధం కాలేదు, ఏదైతే అది అయ్యిందని నేను మళ్ళీ తనని అడిగాను, ‘ఈ కాలం లో లవ్ అని టైం పాస్ చేసే వారే ఎక్కువ, నువ్వంటే నాకు మంచి ఒపీనియన్ ఉంది, ఇష్టం కూడా, కానీ ఈ లవ్ లంటేనే నాకు ఇష్టం ఉండదు, ప్రేమ అంటాడు, పెళ్లి అంటే పారిపోతాడు’ అని నాతో చెప్పింది తను.

పోకిరి క్లైమాక్స్ కన్నా పెద్ద ట్విస్ట్ (నా దృష్టిలో).. :

‘ఒక 5 మినిట్స్ ఇక్కడే ఉండు నేను బైటికి వెళ్ళొస్తా’ అని తనతో చెప్పా, 5 నిమిషాలలో బైటికి వెళ్ళొచ్చా, నిజంగానే పెళ్లి చేసుకుంటే నీకు ఒకే నా అని తనని అడగ్గా, ఇప్పటికిప్పుడు నా మేడలో నువ్వు తాళి కట్టినా, నేను కట్టించుకుంటా అని తను సమాధానమిచ్చింది, జేబిలో నుండి తాళి బైటికి తీసి తన మేడలో కట్టేసా, అమ్మాయి అలా నిల్చునిపోయింది, చిన్నపాటి షాక్ ఏ తగిలింది పాప కి….

రెస్టారెంట్ లో.. :

తను ఇంకా షాక్ లోనే ఉంది. మనిషి ఈ లోకం లో లేదు, నడువు అంటే నడుస్తుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. నాకు ఆకలి బాగా వేస్తుండటం తో వెంటనే తనని రెస్టారెంట్ కి తీసుకెళ్లా, రెస్టారెంట్ కి వెళ్ళాక పాప లో చలనం వచ్చింది, తను మాట్లాడే ముందే, ‘ఏదైనా ఆర్డర్ చేద్దామా నైట్ నుంచి ఏం తినలేదు ఆకలేస్తుందని తనతో చెప్పాను’….

నాన్న గారు అది……. తరువాయి భాగం Part3 లో చదవండి.

Part 1 : https://telugu.ap2tg.com/prashanthamaina-jeevitham-part1/

Comments

comments

Share this post

scroll to top