‘ప్రశాంత’మైన జీవితం లో అలజడి – PART1

హాయిగా సాగుతున్న జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా, నా లాగే ఎందరో అనుకోండి. మన అబ్బాయిలంతా అంతే, నా కథ చెప్పాలంటే. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చాక. ఆంధ్ర విభజన కు నా కథ కు కు ఎటువంటి సంబంధం లేదు, తనతో పరిచయం దెగ్గరనుంది మొదలుపెడతా..

ఇంటి పైకి వచ్చింది అనుకున్నా, ఇంట్లోకి వస్తుందనుకోలేదు..:

మేము ఉండేది హైదరాబాద్. మాది సొంతిల్లు, నేను అమ్మా నాన్న. మేము ముగ్గురం ఉంటాం, ఇంటి పైన ఒక చిన్న పెంట్ హౌస్. కాలేజీ లో ఉన్నన్ని రోజులు నేను పెంట్ హౌస్ లో పడుకొనే వాడిని, కాలేజీ అయ్యాక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రయల్స్ మొదలెట్టాక ఇంట్లోనే పడుకునేవాడిని, దీంతో పైన పెంట్ హౌస్ ని వృధా పోనీకుండా మా నాన్న ఎవరికైన రెంట్ కి ఇవ్వాలనుకున్నాడు, అనుకున్నవెంటనే టూలెట్ బోర్డు తగిలించాడు, తగిలించిన అరగంట కె ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, ‘మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం అంకుల్, మేము ఉంటున్న హాస్టల్ లో ఫుడ్ సరిగ్గా లేదు, మా నుండి మీకు ఎలాంటి ప్రాబ్లెమ్ రాదు’ అని మా నాన్న తో చెప్పారు ఆ ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయిలు అవ్వడం తో మా అమ్మ నా వైపు అదోలా చూసింది, నా వల్ల వాళ్లకేమన్న ప్రాబ్లెమ్ వస్తుందేమో అని మా అమ్మ భయం.

మా నాన్న కి మాత్రం నా మీద ఫుల్ గా నమ్మకం ఉంది, ఎందుకంటే మంచి మర్క్స్ తెచ్చుకున్నా గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడుతున్నాడు, పార్టీ లు పబ్ లు అమ్మాయిలు ఫ్రెండ్స్ అని అస్సలకి బయటికి పోడు, ఈ అమ్మాయిల వల్లే వీడికి ప్రాబ్లెమ్స్ వస్తాయి అని మా నాన్న అనుకున్నాడు. మా నాన్న నన్ను పిలిచి నీకేం ప్రాబ్లెమ్ లేదు కదా అని అడిగాడు, అమ్మాయిలిద్దరూ చూడటానికి బాగున్నారు, ఇంక ప్రాబ్లెమ్ ఏంటి చెప్పండి, నేనైతే మా నాన్నతో నాకెలాంటి ప్రాబ్లెమ్ లేదని చెప్పాను.

మరుసటి రోజు…

మరుసటి రోజు మా ఇంటి పైకి ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండటం తో ఒక వారం తరువాత వారితో పరిచయం పెరిగింది, అలా అలా చిన్నగా వారితో పరిచయం బాగా ముడిపడిపోయింది, రెండు నెలలు దాటాక నేను ఎటు వెళ్లాలన్న వారితోనే వెళ్ళేవాడిని, మా ఇంట్లో వాళ్ళతో కూడా బాగా కలిసిపోయారు వారిద్దరు.

వన్ వికెట్ డౌన్..:

ఇంతలో ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి ఖాయం చేసారు, అబ్బాయి చూడటానికి బాగున్నాడు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. దీంతో అమ్మాయి కూడా సరే అనింది, తను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి మాత్రం ఉండిపోయింది, ఒక్కటే ఉంటుంది కాబట్టి తను ఎక్కువగా మా ఇంట్లోనే ఉండేది, చూస్తూ చూస్తూ 4 నెలలు గడిచిపోయాయి. ఈ 4 నెలల్లో చాలా అంటే చాలా దెగ్గరయ్యా తనకి, తను ఒక 10 రోజులు వాళ్ల ఇంటికి వెళ్ళింది. ఆ 10 రోజులు నేను తనని ఎంతో మిస్ అయ్యా, అప్పుడు అర్ధమైంది నేను తనతో ప్రేమలో ఉన్నా అని.

నాన్నా అది…:

మా అమ్మ ఎప్పుడో ఎక్సపెక్ట్ చేసింది ఈ విషయం, కానీ మా నాన్న కి నా పైన ఎంతో నమ్మకం ఉంది. అందుకే నాన్న కు నేను ప్రేమిస్తున్న విషయం చెప్పా.. మా నాన్న దెగ్గరకు వెళ్లి.. ‘నాన్న, నేను మన ఇంటి పైన ఉంటున్న అమ్మాయిని ప్రేమిస్తున్నా, తనకి ఇంకా ఈ విషయం చెప్పలేదు. నువ్వు చెప్పమంటే చెబుతా లేదంటే లేదు’ అని చెప్పా మా నాన్న తో.

సినిమాల్లోనే అనుకున్నా..

నా మాటలు విన్న మా నాన్న కొద్ది సేపు సైలెంట్ అయ్యాడు, ఆ తరువాత మా నాన్న మాట్లాడిన మాటలకు నేను సైలెంట్ అయ్యాను, ‘నువ్వు ఇన్ని రోజులు ఆ పైనింటి అమ్మాయిలతో తిరుగుతుంటే తేడా గాడివి అనుకున్నా, బ్రతికించావ్ రా, ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన వెంటనే తనకు నీ మనసులో మాట చెప్పేయ్’ అని నాతో అన్నాడు, నేను మా అమ్మ ఇద్దరం షాక్ అయ్యాం. సినిమాల్లోనే అనుకున్నా. నిజ జీవితం లో కూడా సపోర్ట్ గా ఉంటారని అనుకోలేదు, కానీ మా నాన్న కి నేను తేడానేమో అని వచ్చిన అనుమానం గురుంచి తలుచుకున్నప్పుడల్లా నాకు బాధ అసహ్యం వేసేది, నలుగురితో కలిసి పార్టీ లకు పబ్ లకు వెళ్లనందుకు బాధ పడేవాడిని, మా నాన్నకే ఆ డౌట్ వచ్చింది అంటే ఇంక మిగిలిన వాళ్ళకి ఎలా అనిపించి ఉంటాదో అని నా మీద నాకే అసహ్యం వేసింది.

తనకు ప్రొపోజ్ చేద్దాం అని తన రాక కోసం వేచి చూస్తూ ఉన్నా………తరువాయి భాగం part2 లో చదవండి.

Comments

comments

Share this post

scroll to top