ప్రపంచం లోనే బోయింగ్ 777ను నడిపే అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలెట్‌గా పేరొందిన తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా.?

మన తెలుగమ్మాయి ప్రపంచం లోనే అతి పెద్ద ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ అయిన బోయింగ్ 777ను నడిపే అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలెట్‌గా పేరొందారు. ఆమె పేరు ‘అనీ దివ్య’. అనీ పంజాబ్ లో జన్మించారు, అనీ తండ్రి గారు సైనికుడు. అనీ కు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే విజయవాడ కు ట్రాన్స్ఫర్ వచ్చింది అనీ తండ్రి గారికి. దింతో ఫ్యామిలీ మొత్తం విజయవాడ కు షిఫ్ట్ అయ్యారు.

అనీ 17 ఏళ్ల వయసులోనే పైలెట్ కోర్సు పూర్తి చేశారు. 19 ఏళ్ల వయసులో ఆమెకు ఎయిర్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది, 21 ఏళ్ల వయసులో ఆమె బోయింగ్ 737 విమానాన్ని నడిపారు. ఇటీవలే ఆమె బోయింగ్ 777ను నడిపారు. ప్రస్తుతం అనీ వయసు 30 సంవత్సరాలు. అనీ పైలట్ శిక్షణ పూర్తి చెయ్యడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.

డబ్బు మొదలు బాష వరకు :

పైలట్ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి 15 లక్షలు అవసరం అనీ కు, అనీ తండ్రి గారు అంత డబ్బును సమకూర్చలేకపోయారు. ఫ్రెండ్స్ కొంత డబ్బుని సర్ధారు, మరి కొంత అనీ బ్యాంకు లో లోన్ తీసుకున్నారు. పైలట్ కోర్స్ లో ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, మొదట్లో ఆమె కు ఇంగ్లీష్ అంతగా వచ్చేది కాదు, ఆమె ఇంగ్లీష్ బాష మాట్లాడుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు హేళన చేసేవారు. కానీ ఆ తరువాత ఆమె ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆమె తప్పుల్ని ఆమె మిత్రులు సరి చేసేవారు. క్రమక్రమంగా అనీ ఇంగ్లీష్ బాగా మాట్లాడసాగారు. ప్రస్తుతం హిందీ కంటే ఇంగ్లీష్ బాషనే చాలా బాగా మాట్లాడతారు అనీ.

కష్టమే కానీ అసాధ్యం కాదు :

“పైలట్ కోర్స్ కష్టమే, ప్లస్ 2 లో 50% కి పైగా మార్కులు రావాలి, అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తీసుకోవాలి. అమ్మాయిలకు ఇంకా పూర్తిగా స్వేచ్ఛ రాలేదు, విజయవాడ లోని కాలేజెస్ లో అమ్మాయిలు టీ-షర్ట్స్, మోడరన్ డ్రెస్సెస్ వేసుకుంటే కాలేజి యాజమాన్యం తిడతారు, అమ్మాయిలు వారి ఇష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోవాల్సి వస్తుంది, గవర్నమెంట్ పైలట్ కోర్స్ కు లోన్ లు ఇవ్వాలి, బ్యాంక్స్ లో వడ్డీ చాలా ఎక్కువ కనుక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నేను మధ్య తరగతి నుండి వచ్చినా, మా అమ్మా నాన్న ప్రోత్సాహం వల్లనే ఈ స్థాయి లో ఉన్నా”, అని అనీ దివ్య తెలిపారు.

 

 

Comments

comments

Share this post

scroll to top