మహారాష్ట్ర సీఎం హెలికాప్టర్ క్రాష్ లాండింగ్..! పెనుప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకున్నారు!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ లాతూర్‌ వద్ద క్రాష్‌ అయింది. పెనుప్రమాదం నుండి ఆయన తప్పించుకున్నారు. అధికారులతో ముంబై నుంచి లాతూర్ బయలుదేరారు సీఎం. గమ్యస్థానం చేసుకున్న సమయంలో.. కిందకు దిగుతున్న సమయంలో హెలిప్యాడ్ లో కాకుండా రోడ్డు పక్కన మట్టి గుప్పలపై దిగింది. అప్పటికే పైలట్ స్పీడ్ కంట్రోల్ చేయటం పెను ప్రమాదం తప్పింది. హెలికాఫ్టర్ కొంచెం దెబ్బతిన్నది.


ఈ ఘటనలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తాను సేఫ్‌గా ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని ఫడ్నవీస్‌ ట్వీట్‌ చేశారు. ఫడ్నవీస్ హెలికాఫ్టర్ క్రాష్ ల్యాండింగ్ సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. పది రోజుల క్రితమే హెలికాప్టర్‌లో సమస్య తలెత్తినట్లు సమాచారం. అయినా హెలికాప్టర్‌ను ఎందుకు వినియోగించరానేది ప్రశ్నార్ధకంగా మారింది.

Comments

comments

Share this post

scroll to top