షార్ట్ ఫిలిం హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న “అర్జున్ రెడ్డి”..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి చేరిపోయాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో విజయ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్‌ తరవాత ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్న విజయ్.. కొత్త సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. నిఫ్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. కామిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అనంతపురం అమ్మాయిని తీసుకున్నారు. అనంతపురంలో పుట్టి పెరిగిన మోడల్ ప్రియాంక జవాల్కర్‌‌ను విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఖరారు చేశారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా.. మరో సినిమా నవంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. ఈ రెండూ కాకుండా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించనున్న చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభంకానుంది. ఇకపోతే.. “అర్జున్ రెడ్డి”తో అమెజింగ్ హిట్ అందుకొన్న విజయ్ కు జోడీగా పరిచయమవ్వనుండడం ప్రియాంక జవాల్కర్ కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. మరి అమ్మడు తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకొంటుంది అనే విషయం ఆమె చేతిలోనే ఉన్నా.. ప్రస్తుతానికైతే గోల్డెన్ చాన్సే దక్కించుకొంది ప్రియాంక.

watch video here:

Comments

comments

Share this post

scroll to top