బైక్ స్టంట్ చేస్తుండగా “మంచు విష్ణు” తో పాటు ఆ హీరోయిన్ కి కూడా ఆక్సిడెంట్ లో గాయలయ్యి..!

హీరో మంచు విష్ణుకు తీవ్ర‌గాయాల‌య్యాయి. ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో భాగంగా మ‌లేషియాలో చేస్తున్న బైక్ ఛేజింగ్ షాట్ లో విష్ణు న‌డుపుతున్న బైక్ స్కిడ్ అయ్యి కింద‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో విష్ణుకు తీవ్ర‌గాయాల‌యిన‌ట్టు స‌మాచారం.! అయితే వెంటనే హాస్పిటల్ కి తరలించారు..icu లో ఉన్నారు అని మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. కానీ అది నిజం కాదంట. ఆక్సిడెంట్ జరిగింది కానీ icu లో అడ్మిట్ అవ్వలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సినిమాలో బైక్ చేస్ సీన్ షూట్ చేస్తున్న సందర్భంలో బైక్ కంట్రోల్ తప్పి ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగినప్ప్పుడు హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కూడా ఆ బైక్ వెనక సీట్ లో కూర్చొని ఉన్నారు మంచు విష్ణు తో పాటు ఆమెకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈ విషయం గురించి ఆమె ఫేస్బుక్ లో స్పందించారు. నాకు ఆక్సిడెంట్ అయ్యిందని ఆందోళన పడి ఎంతో మంది మెసేజ్ చేసారు. స్వల్ప గాయాలనుండి మేము బయటపడ్డాము. ఇప్పుడు బాగానే ఉంది. త్వరలోనే మళ్లీ షూటింగ్ కి వెళ్తాము అని అన్నారు.

Comments

comments

Share this post

scroll to top