ప్ర‌ధాని మోడీని హ‌త్య చేస్తే రూ.50 కోట్లు ఇస్తామంటూ ఫోన్ కాల్‌… ఫోన్ చేసింది ఎవ‌రంటే..?

కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్రధాని మోడీ ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా శ‌త్రుదేశమైన పాక్ పీచ‌మ‌ణ‌చ‌డానికి ఆయ‌న చేస్తున్న ప‌ని, ప‌న్నుతున్న ప్లాన్‌లు, అమ‌లు చేస్తున్న ప్ర‌ణాళిక‌లు అన్నీ ఇన్నీ కావు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో పాక్ సైనికుల న‌డ్డి విరిచి దేశ జెండాను స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేశారాయ‌న‌. అయితే స‌హ‌జంగానే భార‌త్ అంటే ప‌డని పాక్ మోడీ అనుస‌రిస్తున్న విధానాలు, చేస్తున్న ప‌నుల ప‌ట్ల ఇంకా ఆయ‌నంటే ద్వేషం పెంచుకుంది. అందుకే ఏకంగా ఆయ‌న్ను హ‌త‌మార్చేందుకు ప్లాన్ వేసింది. తాజాగా ఈ విష‌యం పోలీసుల‌కు తెలిసింది.

పాకిస్తాన్‌లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మ‌న దేశానికి చెందిన వ్య‌క్తికి తాజాగా ఓ ఫోన్ కాల్‌ వ‌చ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన సోని అనే వ్యక్తికి ఆ ఫోన్ చేశారు. అత‌ను రూ.50 కోట్లు ఇస్తాన‌ని ప్ర‌ధాని మోడీని హ‌త్య చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని సోనిని అడిగాడ‌ట‌. అయితే అదేదో ఫేక్ కాల్ అని ముందుగా సోని అనుకున్నాడ‌ట‌. అయితే అదే వ్య‌క్తి నుంచి ఆ కాల్ మ‌ళ్లీ రావ‌డంతో అత‌ను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు. ఆ వ్య‌క్తి ఫోన్ నంబ‌ర్‌ను ట్రేస్ చేశారు. అది 79651219 గా ఉన్న‌ట్టు నిర్దారించారు. ఇందులో త‌క్కువ నంబ‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఆ వ్య‌క్తి సోనికి ఫోన్ చేసి ఏం మాట్లాడాడంటే… ముంబైలో జరిగే ఒక ర్యాలీలో మోడీని చంపడానికి తమకు సహకరించాలని కోరాడ‌ట‌. మోడీని హత్య చేయడం కోసం ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేశామని, మూడో వ్యక్తి కూడా అవసరమని చెప్పాడు. మూడో వ్యక్తి అవసరం వల్లే సోనికి ఫోన్ చేసినట్లు చెప్పాడ‌ట‌. అలా స‌హ‌క‌రిస్తే రూ.50 కోట్ల వ‌ర‌కు ఇస్తామ‌ని ఆ వ్య‌క్తి సోనికి చెప్పాడ‌ట‌. అంతే కాదు, ఆ మొత్తం చాల‌క పోతే ఇంకా ఇస్తామ‌ని కూడా అత‌ను సోనికి చెప్పాడ‌ట‌. ఇదే విష‌యాన్ని సోని పోలీసుల‌కు చెప్పాడు. దీంతో పోలీసులు ఈ విష‌యాన్ని చాలా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఆ వ్య‌క్తి ఎవ‌రో ట్రేస్ చేసే ప‌నిలో ప‌డ్డారు. మ‌రి ఆ వ్య‌క్తిని పోలీసులు ప‌ట్టుకుంటారో, లేదో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top