డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ “యాంకర్ ప్రదీప్”తో ఉన్న అమ్మాయి ఎవరు? ప్రదీప్ కు ఏమవుతుంది? మద్యం తాగిందా?

న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి కారు నడిపి అడ్డంగా బుక్కయిన యాంకర్ ప్రదీప్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు మరో కేసు న‌మోదు చేయ‌నున్నారు.! మ‌ద్యం తాగి కార్ ను డ్రైవ్ చేసిన నేరంతో పాటు … ప్రదీప్ కార్ అద్దాల‌కు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దానిపై కూడా మరో కేసు న‌మోదు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం ! రూల్స్ ప్రకారం బ్రీత్ ఎన‌లైజ‌ర్ లో 150 పాయింట్లు వస్తేనే రెండు రోజుల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అలాంటిది ప్రదీప్‌కు ఏకంగా 178 పాయింట్లు రావడంతో వారం రోజుల జైలుశిక్ష పడవచ్చని సమాచారం.! దీంతో పాటు జ‌రిమానా కూడా భారీగా విధించే అవ‌కాశముంది.

watch video here:

ప్ర‌స్తుతం ప్ర‌దీప్ కార్ జూబ్లీహిల్స్ పోలీసుల అధీనంలో ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నాంపల్లి కోర్ట్ లో నిపుణుల‌చే ప్ర‌దీప్ కు కౌన్సెలింగ్ ఇప్పించిన త‌ర్వాత కోర్ట్ లో ప్రవేశ‌పెడ‌తారు. జ‌డ్జ్ తీర్పు అనుసారం…ప్ర‌దీప్ కు ఎన్ని రోజుల శిక్ష ప‌డుతుంది? జ‌రిమానా ఎంత ? అనేది తెలుస్తుంది.! ఇదంతా ఒక ఎత్తు అయితే..ప్రస్తుతం అందరిలో వేరే చర్చ నడుస్తుంది. అదేంటంటే..? ప్రదీప్ తో పాటు ఉన్న అమ్మాయి ఎవరు?

అయితే ఇవన్నీ అటుంచితే..?

టీవీ యాంకర్ ప్రదీప్ పక్క సీటులొ అమ్మాయి ఎవరు అనేది బయటపెట్టలేదు… చూపించనులేదు. ప్రదీప్ తో అమ్మాయి తాగిందా?..లేదా? ..ఎక్కడ నుంచి వస్తున్నారు?..ఇంకా కారులో ఎంతమంది ఉన్నారో తెలియాల్సింది. ఎప్పుడు డీసెంట్‌‌గా ఉన్న ప్రదీప్ ఒక్కసారిగా మీడియాలో మార్మోగుతుండటంతో అతని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ ఎవరామె? ప్రదీప్‌‌కు ఆమెకు ఉన్న సంబంధమేంటి? అనేది తెలియాలంటే మీడియా తో ప్రదీప్ మాట్లాడాల్సిందే.!

ఇది ఇలా ఉండగా నెటిజన్ల ప్రశ్నలివీ..!

లక్షలు సంపాదించే ప్రదీప్ అసలు డ్రైవర్‌ను ఎందుకు పెట్టుకోలేదు? ఇవాళ మద్యం మత్తులో ఉంటాం కదా అని తెలిసినప్పుడైనా కనీసం డ్రైవర్‌‌ను పెట్టుకోవాలని ప్రదీప్‌కు తెలియదా? చేజేతులారా ప్రదీప్ తన ఇమేజ్‌ డ్యామేజ్ చేసుకున్నట్లైంది? లక్షలు ఖర్చు చేసే కారు పోయింది.. ప్రదీప్ పరువు పోయింది? అని నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రోగ్రామ్స్‌లో ఎప్పుడు చూసినా ప్రదీప్ రాస్కోండ్రా.. రాస్కోండి అంటుంటాడు.. ఇప్పుడు ఆయన లెక్కే పోలీసులు రాసుకున్నారు అంతే పెద్ద తేడా ఏమీ లేదని నెటిజన్లు అనుకుంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top