లైవ్ షోలో ప్రదీప్ కు షాకిచ్చిన యాంకర్ సుమ.!

బుల్లితెర సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి సుమ….. నేను మాత్రం తక్కువా అంటూ దూసుకొస్తున్న మరో యాంకర్ ప్రదీప్. ఇద్దరూ ఇద్దరే..యాంకరింగ్ చేయడంలో …స్పాంటేనియస్ గా స్పందించడంలో…. జోక్స్ వేయడంలో…తమ మాటలతో ఇతరులను మెప్పించడంలో ఇద్దరూ ఘనాపాటీలే. అలాంటిది లైవ్ షోలో ఉన్న ప్రదీప్ ను ఫోన్ చేసి మరీ సుమ ఆటపట్టించింది.  అతని పెళ్లి గురించి సెటైర్లు వేసింది. 10 టివి చిట్ ఛాట్ లైవ్ షో కు యాంకర్ ప్రదీప్ గెస్ట్ గా వచ్చారు. ఇంతలోనే ఫోన్ లైన్ లో యాంకర్ సుమ వేరే గొంతుతో కాసేపు ప్రదీప్ ను ఆటపట్టించింది. తర్వాత పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ….. సోషల్ మీడియాలో రెండు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి…అందులో ఒకటి… ప్రభాస్ కి పెళ్లి కాబోతుందని…మరోటి ప్రదీప్ కు అల్రెడీ పెళ్లి అయిపోయిందని అంటూ సెటైర్స్ వేసింది.

త్వరగా ప్రదీప్ కు పెళ్లి కావాలని…ఆయన మాత్రం ఎందుకు సంతోషంగా ఉండాలి? అంటూ తనదైన స్టైల్లో పంచులు వేసింది సుమ.!  మొత్తానికి ఇద్దరు యాంకర్లు కలిసి కాసింతసేపు ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ షోలో ప్రదీప్ తన చిన్ననాటి సంగతుల నుండి ప్రస్తుతం కెరీర్ సాగుతున్న తీరున్నంతా వివరించారు. ఇండస్ట్రీలో తమన్నా తనకు చాలా మంచి ఫ్రెండ్ అని చెబుతూనే…..ఓ స్కూల్ హాస్పిటల్ కట్టించాలన్నది తన ఎయిమ్ అని తెలిపారు ప్రదీప్.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top