ప్రభుత్వానికి బుద్ది చెప్పడం కోసం ప్రతిరోజు 3KM ఈదుకుంటూ స్కూల్ కు వెళుతున్న విద్యార్థి.

 ఇత‌ని పేరు అర్జున్ సంతోష్‌. వ‌య‌స్సు 14 ఏళ్లు. కేర‌ళ‌లోని అల‌ప్పుజా జిల్లా పెరుంబ‌లం గ్రామంలో ఉంటాడు. అయితే అక్క‌డంతా నీరే ఉంటుంది. కాబ‌ట్టి ప్ర‌జ‌లంతా నాటు ప‌డ‌వ‌ల ద్వారానే రాక‌పోక‌లు సాగిస్తుంటారు. అర్జున్ సంతోష్ కూడా ప‌డ‌వ‌ల ద్వారానే నిత్యం స్కూల్‌కు వెళ్తుంటాడు. అందుకు గాను అత‌నికి గంట‌న్న‌ర‌కు పైగానే స‌మ‌యం ప‌డుతుంది. ఈ క్ర‌మంలో అక్క‌డ రాను రాను జ‌నాభా పెరుగుతుండ‌డంతో ప‌డ‌వ‌లు చాల‌క ర‌వాణా సౌక‌ర్యం మ‌రింత క‌ష్ట‌త‌రంగా మారింది. నాటు ప‌డ‌వ‌లు చిన్న‌గా ఉండడం, ఎక్కువ మంది ఒకే ప‌డ‌వ‌లో వెళ్తుండ‌డంతో చాలా మంది ప్ర‌మాదాల బారిన ప‌డ‌సాగారు. దీన్ని గ‌మ‌నించిన ఆ గ్రామ ప్ర‌జ‌లు గ‌త 25 ఏళ్లుగా ఎన్నో సార్లు ప్ర‌భుత్వాల‌కు అర్జీలు పెట్టుకున్నారు. విన‌తులు విన్న‌వించారు. త‌మ గ్రామంలో ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయాల‌ని వేడుకున్నారు. అయితే నాయ‌కుల తీరు తెలుసు క‌దా. వాగ్దానాలు చేసినంత సుల‌భంగా బ్రిడ్జిని నిర్మించ లేక‌పోయారు. దీంతో విద్యార్థి అర్జున్ సంతోష్ త‌న‌దైన రీతిలో వినూత్నంగా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాడు.
353D6A2100000578-3639729-image-m-4_1465858103046-1.jpg.pagespeed.ce.ViXqW2lYjU
అర్జున్ సంతోష్ త‌మ గ్రామం నుంచి నిత్యం 3 కిలోమీట‌ర్ల పాటు నీటిలో ఈదుకుంటూనే పాఠ‌శాల‌కు వెళ్ల‌డం ప్రారంభించాడు. ఎందుకిలా చేస్తున్నావ‌ని ఎవ‌రైనా అడిగితే, త‌మ గ్రామానికి బ్రిడ్జి సౌక‌ర్యం కోస‌మే ఇలా నిర‌స‌న చేస్తున్నానని చెప్ప‌సాగాడు. దీంతో ఈ విషయం ఆ జిల్లా క‌లెక్ట‌ర్ దాకా వెళ్లింది. ఈ క్ర‌మంలో స్పందించిన జిల్లా క‌లెక్ట‌ర్ వెంట‌నే అర్జున్‌కు లేఖ రాసింది. ఈద‌డం మాన‌మ‌ని, బ్రిడ్జి విష‌యం ఆలోచిస్తామ‌ని  క‌లెక్ట‌ర్ గిరిజ అర్జున్‌కు లేఖ రాసింది. దీంతో తాత్కాలికంగా అర్జున్ త‌న నిర‌స‌న‌ను ఆపేశాడు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా త‌క్ష‌ణ‌మే స్పందించి త‌మ గ్రామానికి బ్రిడ్జి నిర్మిస్తుంద‌నే ఆశ‌తో అత‌ను ఉన్నాడు. అయితే ప్ర‌భుత్వం గ‌న‌క వెంట‌నే స్పందించ‌క‌పోతే మళ్లీ అలానే ఈదుతాన‌ని చెబుతున్నాడు అర్జున్‌. అంతేగా మ‌రి, క‌డుపు మండితే, పెద్ద‌లు కాదు, పిల్ల‌లు కూడా నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తారు. అర్జున్‌తోపాటు అత‌ని గ్రామ‌స్తుల 25 ఏళ్ల క‌ల అయిన బ్రిడ్జిని కేర‌ళ ప్ర‌భుత్వం ఎంత త్వ‌ర‌గా నిర్మిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Comments

comments

Share this post

scroll to top