Y.S షర్మిల విషయంలో ప్రభాస్ రియల్ హీరో అయ్యాడు.!

సెలెబ్రిటీలు అంటే చాలు గాసిప్స్ గుప్పుమంటాయ్… ప్రైవేట్ లైఫ్ మీదే కాదు,వాళ్ళ  పర్సనల్ లైఫ్ లోని అంశాల మీద  కూడా జనాల్లో, మీడియాలో, వెబ్ సైట్స్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయ్.  దీనికి ఎవ్వరు మినహాయింపు కాదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ గాసిప్స్ క్వైట్ కామన్. ఏదో ఒక గాసిప్ పుట్టించి..నిప్పులేనిదే పొగ రాదుకదా! అంటూ  ఉన్న దానికి ,లేనిదానికి ఊహించి, వర్ణించి.. రాసి, ప్రచారం చేసి  ప్రముఖుల పరువు, ప్రతిష్టతకు భంగం కల్గించేలా కొంతమంది ప్రబుద్దులు అదే పనిగా తమ పిచ్చిరాతలు రాస్తుంటారు.

అలాంటిదే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, వైయస్ షర్మిలా ఉదంతం….వారిద్దరికి మద్యే ఏవేవో సంబంధాలు అంటగడుతూ. సోషల్ మీడియాలో  జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనిమీద ఎవరూ నోరు మెదపకపోవడంతో,  లోలోన..ఇది నిజమేనేమో !అని చాలా మంది అనుకున్నారు. కానీ కరెక్ట్ టైమ్ లో ఎంటర్ అయ్యి రియల్ హీరో అనిపించుకున్నాడు ప్రభాస్.

ఓ బహిరంగ లేఖ రాసి….  ఆ ఆరోపణలు నిరాధారమైనవి అంటూ వివరించారు. వాస్తవానికి చాలా మంది హీరోలు తమమీద వస్తున్న గాసిప్స్ కు రెస్పాండ్ అవ్వరు. అవి తమకు కామన్ అన్నట్టు ఉండిపోతారు.  ప్రభాస్ విషయంలో కూడా ఇదే జరిగింది. 1) ప్రభాస్ ఆరోగ్యం పై 2) షర్మిలా విషయం పై…. అదే పనిగా గాసిప్స్ ప్రచారం అవుతూ వచ్చాయ్…

అయితే ఆ గాసిప్స్ ఆయన వరకు రావడంతో ప్రభాసే స్వయంగా రంగంలోకి దిగి..నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిరాధారం. అయినా నాఆరోగ్యం గురించైతే నేను ఇప్పుడు స్పందించకపోయేవాడిని… కానీ,  ఓ పరువు గల కుటుంబం లో ఓ తల్లిగా ,ఓ భార్యగా బాధ్యతలను నెరవేరుస్తున్న మహిళ పట్ల ఇటువంటి పుకార్లు రావడంతో స్పందిస్తున్నా… తనను నేను కలవలేదు, చూడలేదు. దయచేసి ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని  ఓ మహిళ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అన్నలా నిలబడ్డాడు  అడ్డుకున్నాడు  ప్రభాస్.  అప్పటి నుండి ప్రభాస్ మీద నాకున్న అభిమానం మరింతగా పెరిగింది. యంగ్ రెబల్ స్టార్  నా దృష్టిలో రియల్ స్టార్ అయ్యాడు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top