ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు గారి భార్య..! ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటే….!!

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాల షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు. సాహో చిత్ర షూటింగ్ తో పాటు, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మరొక చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరు డార్లింగ్ ప్రభాస్ పేరే చెబుతారు, బాహుబలి సినిమా తరువాత ఇండియా లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిపోయాడు ప్రభాస్. అమ్మాయిలకి ప్రభాస్ అంటే పిచ్చి, అందుకే ప్రభాస్ పెళ్లి గురించి అందరికి ఆతృతే.

పుకార్లు చెక్కర్లు.. :

ప్రభాస్ పెళ్లి విషయం అంటే అందరు మొదట చెప్పే పేరు అనుష్క, హీరోయిన్ అనుష్క ప్రభాస్ త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారని పుకార్లు ఎప్పటికప్పుడు చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి, అయితే ఇటీవల కాలం లో మాత్రం ప్రభాస్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురిని వివాహం చేసుకోబోతున్నాడు, రాజకీయ నేత కూతురిని వివాహమాడబోతున్నాడు, ఆల్రెడీ ప్రభాస్ కి లవర్ ఉంది అంటూ ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారు కొందరు, ఈ విషయాల మీద స్పందించారు కృష్ణంరాజు గారి భార్య శ్యామ‌లా దేవి, శ్యామ‌లా దేవి గారు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి మీద స్పష్టత ఇచ్చారు. ‘ప్ర‌స్తుతం ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత పెళ్ళి చేసుకుంటాడు. ఆ రెండు సినిమాలు త్వరలోనే పూర్తి అవుతాయని,ఆ తర్వాత పెళ్లి కబురు చెబుతామని’ శ్యామ‌లా దేవి తెలిపారు.

 

త్వరలోనే పెళ్ళికొడుకు.. :

శ్యామ‌లా దేవి గారు చెప్పిన విధంగా చూస్తే వచ్చే ఏడాది ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని అర్ధమవుతుంది. డార్లింగ్ ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనే విషయం మాత్రం ఆయన అధికారికంగా ప్రకటించేంత వరకు ఎవరో ఒకరి పేరు పుకార్ల రూపం లో చెక్కర్లు కొడుతూనే ఉంటుంది, మొత్తానికి త్వరలోనే డార్లింగ్ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బాయ్ చెప్పనున్నాడనమాట.

 

Comments

comments

Share this post

scroll to top