“మగధీర” లో ఆ సీన్ లో నటించింది “చిరంజీవి” కాదట.! డూప్ గా చేసిన కమెడియన్ ఎవరో తెలుసా.?

 ప్రభాస్ శ్రీనూ కమెడియన్ గా,కామెడి విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా మనకు సుపరిచితుడే.అయితే ఆయన మెగాస్టార్ చిరంజీవికి డూప్ గా నటించారట.అది కూడా మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట పాటకి..బంగారు కోడిపెట్టా వచ్చెనండీ హేపాప హేపాప హే పాప…. పాట గుర్తుంది కదా.. సుమారు పాతికేళ్లక్రితం ఈ పాటకి చిరంజీవి వేసిన స్టెప్స్ కి కుర్రకారు ఊగిపోయారు..మళ్లీ  మగధీర సినిమాలో ఈ పాటని రాంచరణ్ తో  రీమేక్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి.
మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట పాటలో అ మెరిశారు మెగాస్టార్ చిరంజీవి. ఇన్నేళ్ల తర్వాత కూడా చిరంజీవి తన స్టెప్పులతో  అదరగొట్టారు..అయితే ఈ పాటలో చిరంజీవికి డూప్ గా నటించారట ప్రభాస్ శీను….. ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మగధీరలో చిరంజీవికి నేనే డూప్‌గా చేశాను. ఓ రోజు తెల్లవారుజామున వాల్‌బాల్ ఆడి ఇంటికి వెళ్తున్న నాకు రాజమౌళి ఫోన్ చేశారు. చిరంజీవికి డూప్‌గా కన్పించాలని, నువ్వు చేస్తావా అని అడిగారు.చిరంజీవి గారికి డూప్ గా అంటే ఒప్పుకోకుండా ఎలా ఉంటాను..అందుకే వెంటనే ఒప్పుకున్నాను..  షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన తర్వాత చిరంజీవి వేసుకునే డ్రెస్ వంటిదే తనకూ వేసి కొన్ని డూప్ షార్ట్స్ చేశారు. అయితే చిరంజీవిది, తనది ఒకటే డ్రెస్ కావడంతో సైట్లో ఉన్న చిరుకి కన్పించకుండా తప్పించుకుని తిరిగాను అని చెప్పుకొచ్చారు..

Comments

comments

Share this post

scroll to top