రెండు అడుగుల దూరంలో ప్రభాస్….!

 

తెలుగు సినిమాను  కొత్తపుంతలు తొక్కించిన బాహుబలి.. ఇప్పుడు మరో  పెద్ద రికార్డుకు రెండు అడుగుల దూరంలో ఉంది. ఇప్పటికే ఎవరికీ సాధ్యం కానన్ని ఫీట్స్ సాధించింది బాహుబలి సినిమా. హీరోగా ప్రభాస్ కెరీర్ లోనే ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలవడమే కాకుండా బాలీవుడ్ లోనే కమాన్… ప్రభాస్ అంటూ గ్రీన్ కార్పెట్  పరిచేలా చేసింది బాహుబలి మూవీ..

ఇప్పటికే తెలుగు సినిమా రికార్డుల్నిబద్దలు కొట్టిన  బాహుబలి, ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు రెండు అడుగుల దూరంలో ఉంది. ఆ రికార్డును కనుక అందుకుంటే తెలుగుసినిమా ఎన్నాళ్ల నుంచో కలలుకంటున్న ఫీట్ సాధించినట్టే. ఆ పీట్ ఏంటి అంటే వంద కోట్ల క్లబ్ లో తెలుగు సినిమా..  ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలుపుకుంటే  98 కోట్లు రూపాయలను వసూల్ చేసిన బాహుబలి దిబిగిన్నింగ్ మరో 2 కోట్లు వసూల్ చేస్తే చాలు వంద కోట్ల క్లబ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్టే…

Latest-Stills-Of-Bahubali1

ఇప్పటి వరకు చాలామంది హీరోలకు 40కోట్ల క్లబ్ లోకి చేరడమే గగనంగా మారింది. పవన్ కల్యాణ్ లాంటి హీరోలు దాదాపు 60కోట్ల రూపాయల వరకు వచ్చారు. కానీ వంద కోట్ల క్లబ్ గురించి మాత్రం ఏ తెలుగు హీరో ఆలోచించలేదు. అలాంటి ఆలోచనకు అందని ఫీట్ ను బాహుబలి తో  సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు ప్రభాస్ . ఈ వీకెండ్ తో పాటు మరో 4 రోజులు బాహుబలి సినిమా ఆడగలిగితే వందకోట్లు రావడం గ్యారెంటీ.

CLICK: అన్నపూర్ణ పై డబ్ స్మాష్ లు…

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top