ప్రభాస్ పెళ్ళి మీద ఏకంగా సినిమానే వస్తుంది..!

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ఎవరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.’ బాహుబలి’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ పెళ్లి త్వరలో జరగబోతోంది.ప్రభాస్ పై ఆశలు పెట్టుకొని, కలలుగన్న అమ్మాయిలూ మీరు బాధపడకండి. ఎందుకంటే ఇదంతా రియల్  లైఫ్ లో కాదు..రీల్ లైఫ్ లో జరగనుంది. బాహుబలి చిత్రంలో కాళకేయ రాజుగా భయపెట్టిన విలన్ ప్రభాకర్ కీ రోల్ పోషిస్తున్న సినిమా గురించే ఇదంతా. ఈ సినిమా కోసం “ఆవు పులి.. మధ్యలో ప్రభాస్ పెళ్లి” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు చిత్ర దర్శక నిర్మాతలు.రెడ్ కార్పెట్ రీల్స్ బ్యానర్ పై యువ దర్శకుడు ఎస్. జె. చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది ఈ టైటిల్. పెళ్లికొడుకు  పేరు ప్రభాస్ కాగా పెళ్లి కూతురి పేరు అమృత. ఇది ఈ టైటిల్ మ్యాటర్.
firstlook-aavupulimadhyaloprabhaspelli2
‘బాహుబలి ‘ సినిమాతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇలా స్టార్ ఇమేజ్, క్రేజ్ ఉన్న  హీరోల పేర్లను, సినిమా టైటిల్స్, సినిమాలలో ఉపయోగించుకోవడం కొత్తేంకాదు. వీటివల్ల సినిమాకు బోలెడంత పబ్లిసిటీ అలాగే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్,ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. అయితే ఇందులో యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్నాడా? లేదా అనేది క్వశ్చన్ మార్క్. సినిమాలో అయితే ప్రభాస్ పెళ్లి జరుగుతోంది, మరి రియల్ లైఫ్ లో ప్రభాస్ పెళ్లెప్పుడో..!

Comments

comments

Share this post

scroll to top