బాలీవుడ్ ఖాన్ త్రయానికి చెమటలు పట్టిస్తున్న ప్ర‌భాస్..

ఒక్క సినిమా వెయ్యి మెట్లెక్కించ‌డం అంటే ఏంటో బాహుబ‌లిని చూస్తే మనకు అర్దమవుతుంది. బాహుబలితో  బాలీవుడ్‌కీ  ప్ర‌భాస్ ఘ‌నంగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. రాజమౌళి మార్క్‌ ఎమోషన్స్‌తో రూపొందించిన ఈ చిత్రం రికార్డుల గురించీ, రాజ‌మౌళి గురించి బాలీవుడ్‌లో ఎతో ఘ‌నంగా మాట్లాడుకుంటున్నారు. ప్ర‌భాస్ గురించీ అంతే ఇదిగా చ‌ర్చించుకుంటున్నారు. ఓ టాలీవుడ్ హీరో ధీర‌త్వాన్నీ, వీర‌త్వాన్నీ అక్క‌డ పొగుడుతున్నారు. అవును మ‌రి.. విడుదల నుంచే బాహుబలి సరికొత్త రికార్డ్స్ ని సృష్టించుకొని వస్తుంది. తొలి రోజు రూ. 73 కోట్లు తెచ్చి పెట్టిన హీరో అంటే క్రేజ్ ఉండ‌దా??? త‌ప్ప‌కుండా ఉండాల్సిందే.

bahubali 2

 

ఎక్కడా సినిమా తగ్గకుండా అన్ని భాషలలో విజయ ఢంకా మోగిస్తుంది. ఇండియాలోనే అతి పెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. బాహుబ‌లి ద్వారా ప్ర‌భాస్ ఆ ఘ‌న‌త సాధించాడు. ద‌క్షిణాదికి చెందిన ఓ క‌థానాయ‌కుడు ఉత్త‌రాదిన జెండా ఎగ‌రేయ‌డం చాలా అరుదైన సంగ‌తే. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, విక్ర‌మ్…ఇలా చాలామంది అలాంటి ప్ర‌యత్నాలు చేశారు.కానీ.. ఎవ్వ‌రికీ ఇలాంటి ఘ‌న‌త మాత్రం సాధ్యం కాలేదు.

బాహుబలితో  బాలీవుడ్ ను షేక్ చేశాక ఇప్పుడు అంతా ఇప్పుడు ప్ర‌భాస్ గురించి ఆరా తీయ‌డం మొద‌లెట్టారు. అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, షారుఖ్ ఖాన్ సృష్టించిన రికార్డుల్ని చెద‌లు ప‌ట్టిస్తున్న మొన‌గాడు… ప్ర‌భాస్ అని స‌గ‌ర్వంగా కితాబులు అందుకుంటున్నాడు. దాంతో ప్ర‌భాస్ ఇండియ‌న్ బాక్సాఫీసుకి న‌యా సూప‌ర్ స్టార్‌గా అవ‌త‌రించిన‌ట్టైంది. ప్ర‌భాస్ గురించీ, బాహుబ‌లి గురించీ, రాజమౌళి టేకింగ్ గురించీ.. బాలీవుడ్ మీడియాలో వ‌రుస‌గా క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి. అక్క‌డి స‌మీక్ష‌లు కూడా బాహుబ‌లికి అగ్ర‌తాంబూల‌మిచ్చాయి. ఓ అనువాద చిత్రంగా కాకుండా స్ట్ర‌యిట్ సినిమాగానే బాహుబ‌లిని గుర్తించాయి. మ‌న తెలుగు సినిమాకి ఇంత‌కంటే ఘ‌న‌మైన కీర్తి మ‌రోటి ఉంటుందా..? అందుకే ప్ర‌భాస్ అభిమానులు ఇప్పుడు ఆనంద సాగరంలో తేలియాడుతున్నారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top