“భాగమతి”లో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్..? కొన్ని గంటల్లో సినిమా విడుదలవుతుండగా..!

గెస్ట్ రోల్ ఉందా ఏంటీ : భాగమతి షూటింగ్ లో ప్రభాస్ హల్ చల్

మరికొన్ని గంటల్లో ధియేటర్లలో సందడి చేయబోతున్నది భాగమతి సినిమా. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషన్ లో ప్రభాస్ మెరిశాడు. ముఖాన్ని కవర్ చేస్తూ కర్చీఫ్ కట్టుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా భాగమతి మూవీ షూటింగ్ లో హీరో ప్రభాస్ హల్ చల్ చేయటం.. ఈ వీడియో బయటకు రావటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ వీడియోలో ఒక నిమిషం 50 సెకన్ల దగ్గర ప్రభాస్‌ తళుక్కుమంటాడు. ప్రభాస్ ఇలా కనిపించే సరికి.. సినిమాలోనూ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే అనుష్క కూడా ప్రభాస్ తో తన పరిచయాన్ని స్పష్టం చేసింది. అన్నయ్య అని పిలవలేను.. మంచి మిత్రుడు అని చెప్పింది. ఇలాంటి కామెంట్ చేసిన తర్వాత.. ఇప్పుడు భాగమతి షూటింగ్ లో ప్రభాస్ కనిపించటంతో గెస్ట్ రోల్ చేస్తున్నాడా ఏంటీ అనే క్వశ్చన్ రైజ్ అయ్యింది.

Comments

comments

Share this post

scroll to top