బాహుబలి చిత్రంలో కట్టప్పది అద్భుతమైన పాత్ర… మాహిశ్మతి సేనాని కట్టప్పగా సత్యరాజ్ ఆ పాత్రలో అలా ఒదిగిపోయారు. సినిమా విడుదలైంది సక్సెస్స్ ను సాధించింది. ఇంకా కలెక్షన్ల వేటలో పరుగులు పెడుతోంది. అయితే బాహుబలి చిత్రంలోని ఓ సన్నివేశంలో కట్టప్ప… ప్రభాస్ కాలును తన తలపై పెట్టుకుంటాడు. ఈ సీన్ పై ప్రభాస్ కోలీవుడ్ లో బాహుబలి ప్రమోషన్ కు వెళ్లినప్పుడు తన ఫీలింగ్ ను వ్యక్తపరిచాడు. దాని గురించి ప్రభాస్ చాలా ఫీల్ అయ్యాడు.
380 రోజులు బాహుబలి షూటింగ్ లో షూటింగ్ లో పాల్గొన్నప్పుడు, యుద్ద సన్నివేశాల్లో నటించినప్పుడు కలగని కష్టం సత్యరాజ్ తో ఆ ఒక్క సీన్ లో నటిస్తున్నప్పుడు కలిగిందని, ఆ సమయంలో తాను పడ్డ టార్చర్ మరెప్పుడు పడలేదని అన్నాడు ప్రభాస్.
బాహుబలి మూవీలో శివుడు బాహుబలి కొడుకని తెలుసుకున్న కట్టప్ప, శివుని కాలుని శిరస్సుపై పెట్టుకొంటాడు. తమిళ సినిమాలో అగ్రనటుడైన సత్యరాజ్ తలపై కాలు పెట్టడానికి తాను సందేహించానని, అంతేకాదు రాజమౌళితో అసలు ఆ సన్నివేశం గురించి సత్యరాజ్ గారితో చెప్పవద్దన్నాని ప్రభాస్ తెలిపాడు. కాగా 200 సినిమాల్లో హీరోగా నటించిన సత్యరాజ్ ఆ సన్నివేశం లో నటించడానికి ఒప్పుకోవడమే కాదు… తనలోని భయాన్ని అంతా పోగొట్టి సన్నివేశం రక్తి కట్టేలా ప్రోత్సాహించారని చెప్పాడు. అంత గొప్ప నటుడి నుండి చాలా నేర్చుకున్నానని అన్నాడు ప్రభాస్.
నిజమే మూడు సినిమాలు చేసి పెద్ద హీరోలం, ధీరులం, శూరులం అనే వారున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగువందల పైచిలుకు సినిమాల్లో నటించిన నటుడు ఇలాంటి సన్నివేశంలో నటించడానికి ఏ మాత్రం శంకించలేదు చూశారు. ఇది చాలు సత్యరాజ్ కు నటన పట్ల ఉన్న గౌరవం ఎంతో చెప్పడానికి.. హ్యాట్సాప్ కట్టప్పా…