బాహుబలి – ది కన్‌క్లూషన్. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన సెన్సేషనల్ సినిమా. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే 10 రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.1వేయి కోట్ల వసూళ్లను సాధించి ఆల్ టైం రికార్డు సృష్టించింది. అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ సినిమాగా బాహుబలి 2 రికార్డు నెలకొల్పింది. అయితే బాహుబలి 2 సినిమా మొత్తం మీద మనకు ప్రత్యేకంగా కనిపించింది ప్రభాస్, అనుష్క ఇద్దరి జోడీయే. గతంలోనూ వీరిద్దరూ కలిసి సినిమాలు చేసినా, బాహుబలి 2 లో ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వీరి కెమిస్ట్రీ కూడా సినిమా సక్సెస్‌కు ఓ కారణమే. అయితే మరి… వీరిద్దరూ మరో సినిమా చేస్తారా..? అంటే అవును, విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే వీరిద్దరూ ఓ సినిమాలో నటించనున్నారు.
బాహుబలి 2 తరువాత అనుష్క చేయబోతున్న కొత్త సినిమా పేరు భాగమతి. ప్రభాస్ స్నేహితులైన ఉప్పలపాటి ప్రమోద్, వి.వంశీకృష్ణా రెడ్డిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడట. అందుకు గాను ఇప్పటికే ప్రభాస్ క్యారెక్టర్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. దీంతో అనుష్క, ప్రభాస్‌లు ఇద్దరినీ మనం త్వరలోనే మళ్లీ వెండితెరపై చూడబోతున్నాం అన్నమాట. అయితే మరి… బాహుబలి 2లో లాగే ఆ సినిమాలోనూ ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఉంటుందా..? అంటే.. అందుకూ అవుననే సమాధానం వినిపిస్తోంది.
భాగమతి సినిమాలో ప్రభాస్ చేయనున్నది గెస్ట్ రోల్ అయినప్పటికీ అతని పాత్ర సినిమాలో ముఖ్యంగా కనిపిస్తుందట. అనుష్క-ప్రభాస్‌ల మధ్య ఆ సినిమాలో వచ్చే సన్నివేశాలు కీలకం కానున్నాయట. దీంతో అభిమానుల్లో భాగమతి సినిమాపై భారీ అంచనాలే నెలకొంటున్నాయి. బాహుబలి 2 తరువాత ఆ రేంజ్ లో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తుండడంతో ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఇప్పటి నుంచే ఎదురు చూడడం మొదలు పెట్టారు. మరి… చివరకు సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూస్తే తెలుస్తుంది..!