ప్రభాస్ “సాహో” లో హీరోయిన్ గా చేయడానికి “శ్రద్ధ కపూర్” ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా బాహుబలి ఫీవర్ నడుస్తుంది. తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించారు రాజమౌళి గారు. ఈ సినిమా వల్ల “ప్రభాస్” కు ఎంతో మంచి పేరు వచ్చింది. వాక్స్ స్టాట్యూ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్. సుజీత్ దర్శకతంలో “సాహో” అనే సినిమాలో నటిస్తున్నాడు “ప్రభాస్”. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ టీజర్ కూడా విడుదలయ్యింది. సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ సినిమా మూడు భాషల్లో (తెలుగు, తమిళ, హిందీ ) విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు..!

3 భాషలకు కనెక్ట్ అయ్యే హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అయితేనే అన్ని భాషలకు కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

“ప్రభాస్” సరసన సాహోలో నటించడానికి “దీపికా పడుకునే” కానీ “కత్రినా కైఫ్” ను కానీ సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారట “సాహో” చిత్ర యూనిట్. కానీ దీపిక ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. మరో హాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసే ఆలోచనలో ఉంది. కత్రినా కైఫ్ కు ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కానీ ఫైనల్ గా ఆమె కూడా కాన్సల్ అయ్యింది.

తరవాత “ధోని, లోఫర్” ఫేమ్ “దిశా పటాని” ని హీరోయిన్ గా పెడదాం అనుకున్నారు. కానీ అది కూడా కుదర్లేదు. పూజ హెగ్డే , అనుష్క లను ఫిక్స్ అన్నారు ఇంతలో కాదు అన్నారు.

ఎట్టకేలకు “శ్రద్ధ కపూర్” కి ఫిక్స్ అయ్యారు చిత్ర యూనిట్. మరి వీరిద్దరి జంట ఎలా ఉండబోతుందో చూడాలి.

ఈ సినిమాకి ప్రభాస్ రెమ్యూనరేషన్ 30 కోట్లు. శ్రద్ధ కపూర్ 12 కోట్లు అడిగింది. ఇప్పటివరకు పన్నెండు కోట్లు ఒక సినిమాకి తీసుకున్న హీరోయిన్ కంగనా రనౌత్ ఒక్కరే.

Comments

comments

Share this post

scroll to top