ఎస్సై ప్రభాకర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసా..?దానికి ముందు క్వార్టర్స్ లో “శిరీష” పై….!

బ్యుటీషియన్‌ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మరణాల మిస్టరీ వీడింది. కుకునూర్‌పల్లి పోలీసు క్వార్టర్‌లో శిరీషపై ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి చేసిన అత్యాచారయత్నమే ఇద్దరి ప్రాణాలనూ తీసింది. శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోగా.. ఎస్సై భయాందోళనలతో ప్రాణం తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా రాజీవ్ స్నేహితుడు “శ్రవణ్”. రాజీవ్, తేజస్విలతో గల సమస్యను తేల్చాలని “శిరీష” ఏడాది క్రితం పరిచయం అయిన “శ్రవణ్” ను అడిగింది. కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి తనకు తెలుసని.. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తాడని శ్రవణ్‌ శిరీషకు తెలిపాడు.
ప్రభాకర్‌ రెడ్డి స్పందించి.. బంజారాహిల్స్‌ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న తన బ్యాచ్‌మేట్‌ హరీందర్‌కు ఫోన్‌ చేసి ఈ కేసులో సహాయం చేయాలని కోరారు. దీంతో శ్రవణ్‌, రాజీవ్‌, శిరీష జూన్‌ 12న ఎస్సై హరీందర్‌ను కలిశారు. ఆ కేసును ఎస్సై శ్రీనివాస్‌ చూస్తున్నారని, వారం తర్వాత రమ్మని ఆయన చెప్పారు.

అదే రోజు రాత్రి ముగ్గురూ బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 10లోని కాఫీ షాప్‌నకు వెళ్లారు. అక్కడ ఉండగానే.. ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి శ్రవణ్‌ ఫోన్‌ చేయగా.. కుకునూర్‌పల్లి వస్తే మాట్లాడుకుందామని ఆయన చెప్పారు. శిరీష కూడా వారితో వెళ్లడానికి అంగీకరించింది. సోమవారం రాత్రి 9.30లకు మద్యం కొనుగోలు చేశారు. దారిలో స్నాక్స్‌ తీసుకుని ఫోర్డ్‌ ఎండీవర్‌ కారులో ఔటర్‌ మీదుగా ముగ్గురూ కుకునూర్‌పల్లికి బయలుదేరారు.
శిరీష, రాజీవ్‌ తమ సమస్యను ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి వివరిస్తుండగా.. ‘‘ఆ మేటర్‌ నాకు వదిలేయండి. నా స్నేహితుడు హరీందర్‌ అంతా చూసుకుంటాడు.’’ అని ఆయన వారిద్దరికీ చెప్పారు. తర్వాత శ్రవణ్‌, రాజీవ్‌ సిగరెట్‌ తాగడానికి బయటికి వెళ్లారు.

ఆ సమయంలో శిరీష కూడా వెళ్లబోయింది. సెంట్రీ కానిస్టేబుల్‌ చూస్తాడని చెప్పి.ఆమెను గదిలోపలే ఉంచి శ్రవణ్‌, రాజీవ్‌ వద్దకు .ప్రభాకర్‌ రెడ్డి వెళ్లాడు. ‘‘ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో వ్యభిచార గృహాలు ఉన్నాయి. ఎంజాయ్‌ చేయండి’’ అని సూచించారు. అందుకు వారు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని శిరీష విన్నది. సమస్యను పరిష్కరించాలని కోరితే ఎస్సై వ్యభిచార గృహాల గురించి చెబుతున్నారేంటని అనుమానించింది. అప్పటికి సమయం 1.58 గంటలు అవుతోంది. ఆ సమయంలో.. తన లొకేషన్‌ను భర్త వాట్సప్‌ నంబర్‌కు పంపింది. అతడు స్పందించలేదు. రెండు నిమిషాల తర్వాత.. ‘‘మీరు నన్ను వదిలి వెళ్లకండి. ప్లీజ్‌. నాతోనే ఉండండి’’ అని రాజీవ్‌కు పలు వాట్సప్‌ సందేశాల్ని పంపింది. తర్వాత అందరూ లోపలికి వచ్చి మళ్లీ మద్యం తాగడం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్‌, శ్రవణ్‌ మళ్లీ సిగరెట్‌ తాగడానికి బయటికెళ్లారు.


రాజీవ్‌, శ్రవణ్‌ బయటకు వెళ్లిన కొద్దిసేపటికే లోపలి నుంచి శిరీష ఏడుపు, అరుపులు వినిపించాయి. చూస్తే తలుపులు మూసి ఉన్నాయి. వారు తలుపులు తెరిచి లోపలికి వెళ్లేసరికి.. ఆమె గోడకు నక్కి ‘‘నేను అలాంటిదాన్ని కాదు.. నన్నిక్కడి నుంచి పంపించండి’’ అని ఎస్సై ప్రభాకర్‌ రెడ్డిని భయంతో వేడుకుంటోంది. వారు ఆమెను సముదాయించబోయారు. అప్పుడామె.. ‘‘మీరసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ’’ అని పెద్దగా అరుస్తూ ఏడవటం ప్రారంభించింది. ఎంత సముదాయించినా ఆపకపోవడంతో ఎస్సై భయపడిపోయి ‘‘నేనేం చేయలేదు కదా.. నీతో చెడుగా ప్రవర్తించలేదు కదా’’ ..అని ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అరుపులు మానకపోవడంతో రాజీవ్‌ సహనం కోల్పోయి ఆమెను అసభ్యంగా తిట్టి గట్టిగా చెంపమీద కొట్టాడు. మంగళవారం (13న) తెల్లవారుజామున 02.30 గంటలకు ఆమెను బయటకు తీసుకొచ్చి కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. కారును రాజీవ్‌ డ్రైవ్‌ చేశాడు. ముందు సీట్లో శ్రవణ్‌ కుర్చున్నాడు. వెనకసీట్లో ఉన్న శిరీష ఏడవడం మాత్రం ఆపలేదు. మధ్యదారిలో కారు స్లో అయినప్పుడు డోర్‌ తీసుకుని దిగి పారిపోవడానికి యత్నించింది. కోపొద్రిక్తుడైన రాజీవ్‌ ఆమెను అసభ్యపదజాలంతో దూషించాడు. జుట్టు పట్టి గట్టిగా లాగి కారులో కూర్చుబెట్టాడు. ఎస్సై మంచి చేద్దామని ప్రయత్నిస్తే ఇలా చేస్తున్నావేంటని చెంపలపై తీవ్రంగా కొట్టాడు.


తెల్లవారుజామున 03.45 గంటలకు ముగ్గురూ ఆర్‌జే ఫొటో స్టూడియోకు చేరుకున్నారు. శిరీష కారు దిగి మెట్లెక్కి ఫ్లాట్‌ నంబర్‌ 202 లోపలికి వెళ్లింది. రాజీవ్‌, శ్రవణ్‌ కారు పార్కింగ్‌ చేసి పైకి వెళ్లారు. శిరీష లోపల గడియపెట్టుకుంది. తలుపుతట్టినా తీయలేదు. ‘‘ఆమె మనస్తాపంతో ఉంది. కొద్దిగా విశ్రాంతి తీసుకోనివ్వు’’ అన్నాడు శ్రవణ్‌. ఇద్దరు మళ్లీ కిందకు వెళ్లారు. క్యాబ్‌లో శ్రవణ్‌ సాగర్‌ రింగ్‌రోడ్డులోని ఇంటికి బయల్దేరాడు. ఆ సమయంలో రాజీవ్‌కు వీడియోకాల్‌ చేసింది శిరీష. శ్రవణ్‌ను కారులో పంపిస్తున్న రాజీవ్‌ ఫోన్‌ తీయలేదు. ఆ తర్వాత అతడు ఫోన్‌ చేసినా ఆమె స్పందించలేదు. మళ్లీ ఫైకి వెళ్లి తలుపుతట్టాడు రాజీవ్‌. ఎంతకూ తీయకపోవడంతో తలుపును బలవంతంగా తెరిచాడు. అప్పటికే శిరీష చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. 04.10 గంటలకు రాజీవ్‌ శ్రవణ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.

 

source:abn

Comments

comments

Share this post

scroll to top