పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్..!

Siva Ram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆదివారం తెల్లవారు ఝామున ఆయన కాలినడకన మెట్లదారిలో తిరుమల చేరుకున్నారు. ఈ క్రమంలో అలిసిపోయిన ఆయన మధ్య మధ్యలో మెట్ల మీదే కూర్చుని సేదతీరారు. కొన్ని చోట్ల ఆయన వీధి కుక్కలు, చెత్త కుప్పల పక్కనే కూర్చుని రిలాక్స్ అయ్యారు. ఈ ఫోటోస్ చూసిన అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాు. ప్రజా సేవ కోసం లగ్జరీ లైఫ్ వదిలేసి ఇలా మాతో మమేకం అయ్యే నాయకుడిని తాము ఇప్పటి వరకూ చూడలేదని, పవన్ కళ్యా;ణ్ దేవుడు అంటూ జేజేలు పలుకుతున్నారు.

కుక్క, చెత్తకుప్ప పక్కనే కూర్చున్న పవర్ స్టార్:

పవన్ కళ్యాణ్ రేంజి ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వ్యక్తి కాలి నడకన తిరుమల చేరుకోవడం, వీధి కుక్కలు, చెత్త కుప్పల పక్కన కూర్చొని సేదతీరడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

అలిసి పోయిన పవన్ కళ్యాణ్:

మెట్ల దారిలో తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా అలిసిపోయారు. కొండపైకి చేరుకున్న అనంతరం కొంతసేపు ఇలా రిలాక్స్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ మదర్స్ డే మెసేజ్:

‘మదర్స్ డే అంటే అమ్మను తలచుకోవడం మాత్రమే కాదు. అమ్మ మనకు ప్రసాదించిన జీవితాన్ని తలచుకోవడం. ఈ జీవితాన్ని మనకు ప్రసాదించడంలో అమ్మ చేసిన త్యాగాన్ని తలచుకోవడం. అమ్మ నేర్పిన ప్రతి అనుభూతిని నెమరు వేసుకోవడం. మదర్స్ డే అంటే.. ఏదో ఏడాదికి ఒక రోజు తల్లిని తలచుకుని మిగిలిన రోజులు మొత్తం మరచిపోవడం కాదు. అమ్మంటే మనం జీవించి ఉన్న ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన ఒక బాధ్యత. ఏం చేసినా అమ్మ రుణం తీర్చుకోలేం. అమ్మ నుంచి మనం పొందడం మాత్రమే తప్ప ఇవ్వడం అనేది మన శక్తికి మించిన పని అని పవన్ కళ్యాణ్ అన్నారు.

తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా:

పవన్ కళ్యాణ్ శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు రాగానే మీడియా ప్రతినిధులు ఆయన్ను చుట్టు ముట్టారు. అయితే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు మాట్లాడి తిరుమల పవిత్రతకు భంగం కలిగించడం ఇష్టం లేదంటూ పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు.

 

 

Comments

comments