దటీజ్ సోషల్ మీడియా..! నూడుల్స్ అమ్ముకుంటూ జీవిస్తున్న గ్రేట్ షూటర్ కు ఉద్యోగం ఇప్పించింది.!

“షూటర్ గా  గ్రౌండ్ లో ఉండాల్సిన ఆ యువతి, గరిటె పట్టుకొని రోడ్ పక్కన నూడిల్స్ అమ్ముతోంది. తను చేసే నూడుల్స్ తినడానికి ప్రజలు తన షాప్ వద్దకు రావడానికి ఆకర్షణగా తన ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన మెడల్స్ ని వేలాడదీసింది. కాలేజ్ లో చదువుకుంటూనే షూటింగ్ పై ఉన్న ఇష్టంతో షూటర్ గా ప్రయత్నించి, కొన్ని మెడల్స్ ను సంపాదించుకుంది. ఆ మెడల్స్ వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీలేదు, కనీసం తన అవసరాలు కూడా తీర్చుకోలేనంత పేదరికంలో షూటర్ పుష్పా గుప్తా ఉంది” ….ఆమె నూడుల్స్ సెంటర్ కు వెళ్లిన  ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో అటు నుండి ఇటు ఇటు నుండి అటు షేర్ అవుతూ …… చివరకు అధికారులలో చలనాన్ని తీసుకొచ్చింది.

shooter-750x500

షూటర్ గా మంచి పేరు తెచ్చుకున్న పుష్పా గుప్తా ఆర్ధిక కారణాలతో అటువైపు వెళ్ళలేక తన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇలా నూడుల్స్ బండి నడుపుతూ జీవనం సాగిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా పాకిపోయిన ఈ వార్త చివరికి, గుజరాత్ రాష్ట్ర ఎరువుల కార్పోరేషన్ సంస్థ పుష్పాకు ఉద్యోగాన్నిచ్చింది. మధ్యలోనే ఆపేసిన చదువును మళ్ళీ కొనసాగించాలని, షూటర్ గానూ ప్రోత్సాహం ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది.గొప్ప ప్రతిభను, ఆమె కథను ప్రపంచానికి తెలియజేసేలా సోషల్ మీడియా ద్వారా ఇదంతా చేసిన ఆ వ్యక్తిని గుజరాత్ ప్రభుత్వం అభినందించింది. మనం రోజూ ఎన్నో లైక్స్, పోస్ట్, షేర్స్ లతో సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాం.. కానీ సోషల్ మీడియా ద్వారా దేశ గౌరవాన్ని చాటిచెప్పే ఇలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహిద్దాం.

Comments

comments

Share this post

scroll to top