ఒంగోలు గిత్తల గురించి మీకు తెలియని నిజాలు !!

1868లో భారతదేశం నుంచి విక్టోరియా రాణికి బహుమతులను ఇంగ్లాండ్ కు పంపారు. కానీ ఆ
ఓడ బ్రెజిల్ తీరానికి చేరింది. రాణి కోసం పంపిన బహుమతులలో రెండిటిని అక్కడ అమ్మేసారు.
అవే ఒంగోలు గిత్తలు. ఆ విధంగా బ్రెజిల్ గడ్డపై ఒంగోలు గిత్తల ప్రస్ధానం ప్రారంభమైంది. ఒంగోలు
జాతి పశువులు బ్రెజిల్ చేరి 150 ఏళ్లు అవుతోంది.

రెండు పశువులతో ప్రారంభమైన వాటి ప్రస్ధానం ఇప్పుడు కొన్ని కోట్లకు చేరింది. 1962లో భారత
ప్రభుత్వం నిషేధించే వరకు ఒంగోలు జాకి బ్రెజిల్ కు తరలిపోతూనే ఉండేవి. బ్రెజిలియన్
అసోసియేషన్ ఆఫ్ జెబు (ఏబీసీజీ) బ్రీడర్స్ లెక్కల ప్రకారం ప్రస్తుతం బ్రెజిల్ పశుసంపద
సుమారు 22 కోట్లు. వీటిలో దాదాపు 80శాతం మేలురకం, సంకరజాతి ఒంగోలు
పశువులున్నాయి.

గత 80 ఏళ్లలో అధికారికంగా 10 కోట్లకు పైగా ఒంగోలు జాతి పశువులను ఇక్కడ గుర్తించారు.
బ్రెజిల్ వాతావరణంలో ఒంగోలు జాతి చక్కగా ఇమిడి పోయింది. తక్కువ ఆహారంతోనూ జీవించే
ఈ జాతికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. బ్రెజిల్ ప్రజల ప్రధాన ఆహారంలో పశుమాంసం
ఒకటని లెమోస్ అన్నారు.

ఆ దేశంలో దాదాపు 43 కోట్ల ఎకరాల గడ్డి భూములున్నాయి. అంటే సగటున ఒక్కో పశువుకు
సుమారు రెండు ఎకరాల భూమి ఉంది. అందువల్ల పోషణ సులభంగా ఉంటుంది. బ్రెజిల్‌లో
వెలుగులీనుతున్న ఒంగోలు జాతి సొంతగడ్డపై మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశుగణన
ప్రకారం భారతదేశంలో వాటి సంఖ్య 6.34 లక్షలు. ఇందులో 5.79 లక్షలు ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో మేలుజాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమేనంటున్నారు.

వ్యవసాయంలో ఎప్పుడైతే యాంత్రీకరణ ప్రారంభమైందో మెల్లగా పశువుల అవసరం లేకుండా
పోయింది. అవసరం లేదు కనుక ఆదరణ కూడా తగ్గిపోయింది.
నాడు పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు
రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది.
గ్రామీణ కుటుంబాలకు పాలు ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో ఆవుల స్థానాన్ని
పాలదిగుబడి ఎక్కువగా ఉండే గేదెలు ఆక్రమించాయి.
సజ్జ, జొన్న వంటి ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, మిరప సాగు
పెరిగాయి. దీంతో పశువులకు గ్రాసం కరవైంది.

ప్రభుత్వం 1960లలో తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్‌ ఒంగోలు జాతిపై ప్రతికూల
ప్రభావం చూపింది. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టిన్ వంటి వాటితో ఆ జాతిని కలపడంతో
మేలురకం పలుచ బారింది.

శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు ఒంగోలు జాతికి దగ్గరగా ఉంటాయి. సైబీరియా
ప్రాంతంలో పుట్టిన ఈ జాతి ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఆ తరువాత దక్షిణ
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో
స్థిరపడ్డాయన్న వాదనలూ ఉన్నాయి. .

Comments

comments

Share this post

scroll to top