భయానికే భ‌యం తెప్పించే 9 మంది డైన‌మిక్ లేడీ ఐపీఎస్ ఆఫీస‌ర్లు వీరు తెలుసా..!

ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్‌). భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ఈ శాఖ‌లో ప‌నిచేయడ‌మంటే అది మామూలు విష‌యం కాదు. నిత్యం ఎన్నో సవాళ్ల‌ను అధిగ‌మించాల్సి వ‌స్తుంది. ఛోటా మోటా లీడ‌ర్లు మొద‌లుకొని బ‌డా నాయ‌కులు, రౌడీల వ‌ర‌కు చాలా మంది నుంచి పైర‌వీలు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇక అందులోనూ మ‌హిళ‌లకు నిజంగా ఈ ఉద్యోగం చాలా ట‌ఫ్ జాబ్ అని చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ప‌లువురు మ‌హిళ‌లు నీతి, నిజాయితీల‌తో ప‌నిచేసి గొప్ప ఐపీఎస్ ఆఫీస‌ర్లుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మెరిన్ జోసెఫ్‌
2012లో యూపీఎస్‌సీ ప‌రీక్ష పాసైన మెరిన్ జోసెఫ్ కేరళ క్యాడ‌ర్‌కు చెందిన యంగ్ ఆఫీస‌ర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె త‌న 25వ ఏట మొద‌టి అటెంప్ట్‌లోనే సివిల్స్ ప‌రీక్ష పాస‌వ‌డం గ‌మ‌నార్హం.

2. కిర‌ణ్ బేడీ
ఈమె గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా మందికి ఈమె గురించి తెలుసు. 1972లో ఐపీఎస్ ఆఫీస‌ర్ అయిన మొద‌టి మ‌హిళ‌గా గుర్తింపు పొందింది. అనంతరం పోలీస్ ఆఫీస‌ర్‌గా ఎన్నో డిపార్టుమెంట్ల‌లో సేవ‌లు అందించింది. 1982లో ఈమె ట్రాఫిక్ డీసీపీగా ప‌నిచేస్తున్న‌ప్పుడు రూల్స్ అతిక్ర‌మించిన ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి బ‌డా లీడ‌ర్ల కార్ల‌ను ట్ర‌క్‌లో వేసుకుని తీసుకెళ్లింది. దీంతో అప్ప‌ట్లో ఆమె పేరు దేశంలో మారు మోగింది.

3. సంగీత కాలియా
ఈమెది హ‌ర్యానాలోని ఫ‌తేహాబాద్ జిల్లా. 2009 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌. ఈమె తండ్రి కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ప‌నిచేశాడు. 2015లో ఫ‌తేహాబాద్‌లో ఎస్పీగా విధులు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు అక్క‌డి ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌తో గొడ‌వ‌ప‌డింది. మీటింగ్‌లో ర‌భస చేస్తున్నందుకు అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని ఆమె కోరింది. అయినా అత‌ను స్పందించ‌లేదు. పైగా అలా కోరినందుకు గాను ఆమెను త‌రువాత వేరే ప్రాంతానికి బ‌దిలీ చేశారు.

4. అప‌రాజిత రాయ్
సిక్కిం నుంచి వ‌చ్చిన తొలి గోర్ఖా ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా ఈమె పేరు గాంచింది. ప్ర‌స్తుతం ఈమె వెస్ట్ బెంగాల్ హుగ్లిలో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోంది. 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఈమె. ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా ఈమె Trophy for the best Lady Outdoor Probationer, Umesh Chandra Trophy for Field Combat, Senior Course Officers Trophy వంటి ప‌లు అవార్డుల‌ను అందుకుంది.

5. సంయుక్త ప‌రాశ‌ర్
2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంయుక్త ప‌రాశ‌ర్ ప్ర‌స్తుతం సోనిత్‌పూర్ పోలీస్ ఎస్‌పీగా విధులు నిర్వ‌హిస్తోంది. ఈమె 1979 అక్టోబ‌ర్ 3న జ‌న్మించింది. కాగా అస్సాంకు చెందిన తొలి ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా ఈమె గుర్తింపు పొందింది. అంతేకాదు అస్సాంలోని బోడో తీవ్ర వాదుల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన వీర వనిత ఈమె. కేవ‌లం 15 నెలల్లోనే 64 మంది తీవ్ర వాదుల‌ను ఈమె మ‌ట్టుబెట్టింది.

6. మీరా బోర్వంక‌ర్‌
పంజాబ్ రాష్ట్రంలోని ఫ‌జికా ప్రాంతానికి చెందిన మీరా బోర్వంక‌ర్ జ‌లంధ‌ర్‌లో గ్రాడ్యుయేష‌న్ విద్య‌ను పూర్తి చేసుకుంది. మ‌హారాష్ట్రకు చెందిన తొలి మ‌హిళా ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా ఈమె రికార్డు సృష్టించింది. 1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ ఈమె. మ‌ర్దానీ అనే హిందీ సినిమాను ఈమె జీవిత క‌థ ఆధారంగా తీశారు. జ‌ల్గావ్ సెక్స్ స్కాండ‌ల్‌, అబు స‌లెం కేసు, ఇక్బాల్ మిర్చి కేసుల‌ను ఈమె చేదించింది. 1997లో ఈమె ప్రెసిడెంట్ మెడ‌ల్‌ను అందుకుంది.

7. రువేదా స‌లామ్
2013 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఈమె. జ‌మ్మూ కాశ్మీర్ వాసి. ఐపీఎస్ కాక‌ముందు ఈమె ఓ డాక్ట‌ర్‌. కాశ్మీర్ నుంచి తొలిసారిగా ఐపీఎస్‌కు సెలెక్ట్ అయిన మ‌హిళా ఆఫీస‌ర్‌గా ఈమె పేరు గాంచారు. ప్ర‌స్తుతం ఈమె చెన్నై ఏసీపీగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తోంది.

8. సోనియా నారంగ్‌
2002 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఈమె. ప్ర‌స్తుతం బెంగుళూరు డీసీపీగా ప‌నిచేస్తున్నారు. ఈమె 2006లో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో ఓ క‌ర్ణాట‌క ఎమ్మెల్యేను చెంప దెబ్బ కొట్టారు. అనంత‌రం వార్త‌ల్లో నిలిచారు. ఎలాంటి వారు ఎదురైనా స‌రే ధైర్యంగా ముందుకు వెళ్ల‌డ‌మే ఈ ప‌ని.

9. సౌమ్యా సాంబ‌శివ‌న్
2009 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈమె. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సిర్‌మోర్ ఎస్పీగా ప‌నిచేశారు. నేర‌స్తుల పాలిట సింహ స్వ‌ప్నంగా ఈమె పేరుగాంచారు.

Comments

comments

Share this post

scroll to top