అప్పుడు “మిస్ వరల్డ్” అని పొగిడినవారే ఇప్పుడు ఎలా తిడుతున్నారో తెలుసా.? ఎందుకంటే.?

మనుషి చిల్లర్‌.. మిస్‌ వరల్డ్‌ 2017 టైటిల్‌ను గెలుచుకుని ఒక్కసారిగా ప్రపంచంలోనే పాపులర్‌ అయింది. ఇండియాకు 6వ సారి మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ను సాధించి పెట్టిన యువతిగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే చాలా మంది మనుషి చిల్లర్‌ను ప్రశంసించారు కూడా. ఆమె ఎంత కష్టపడి మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ను సాధించింది వివరిస్తూ మీడియా, ప్రజలు ఆమెను ఆకాశానికెత్తేశారు. అయితే తాజాగా ఈమె చేసిన ఒక పని ఆమె అభిమానులకు కోపం తెప్పించింది. దీంతో మనుషి చిల్లర్‌ను ఒకప్పుడు పొగిడిన వారే ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు మనుషి చిల్లర్‌ ఏం చేసిందంటే…

మీకు డాబూ రత్నాని గురించి తెలుసు కదా. బాలీవుడ్‌ నటీనటులను ఫొటోలు తీసి వాటితో క్యాలెండర్‌ను ఏటా తయారు చేస్తారు. అయితే ఈ సారి కూడా క్యాలెండర్‌ను డిజైన్‌ చేశారు. అందుకు గాను పలువురు సెలబ్రిటీల ఫొటోలను తీశారు. వారిలో మనుషి చిల్లర్‌ కూడా ఉంది. అయితే ఆమె ఆ ఫొటోలకు గాను పోజులిచ్చేందుకు మనుషి చిల్లర్‌ ఓ డ్రెస్‌ను వేసుకుంది. ఆ డ్రెస్‌లో ఆమె కాళ్లు నడుం వరకు ఎలాంటి ఆచ్చాదనా లేకుండా ఎక్స్‌పోజ్‌ అవుతున్నాయి. దీంతో మనుషి చిల్లర్‌ అలాంటి డ్రెస్‌ వేసుకోవడంపై అభిమానులు విమర్శిస్తున్నారు.

మనుషి చిల్లర్‌కు డబ్బులు లేవా.. ఉన్న డబ్బునంతా మిస్‌ వరల్డ్‌ అయ్యేందుకే ఖర్చు పెట్టిందా.. అందుకే ఇప్పుడు బట్టల కోసం డబ్బు లేక అలాంటి చిట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుంటుందా… అని కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. డబ్బులు వస్తే ఎవరైనా ఏం చేసేందుకైనా వెనుకాడరు.. అందుకు ఈవిడే ఉదాహరణ.. అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే… మనుషి చిల్లర్‌ ఇలాంటి డ్రెస్‌ వేసుకోవడం ఏమీ బాగాలేదు… ఆమె గురించి ఎంతో బాగా ఊహించుకున్నాం.. ఇప్పుడిలా చేయడం అస్సలు బాగా లేదు.. అని అంటున్నారు. ఈ క్రమంలో మనుషి చిల్లర్‌ కొత్త ఫొటోల పట్ల నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. అయితే నెటిజన్ల కామెంట్లను మనుషి చిల్లర్‌ ఏమాత్రం పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అవున్లే.. అలాంటి వారికి ఇలాంటి ఫొటోషూట్స్‌ కామనే కదా. మరి ఇంకా ముందు ముందు ఎలాంటి ఫొటోషూట్స్‌ చేస్తుందో.. ఎంత హాట్‌ గా కనిపిస్తుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top