10వ త‌ర‌గ‌తి పాస్ అయి ఉంటే చాలు… పోస్ట‌ల్ శాఖ‌లో జాబ్ మీదే..!

మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవ‌రైనా కేవ‌లం 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్రమే చ‌దువుకున్నారా..? మ‌ంచి మెరిట్ మార్కులు వ‌చ్చాయా..? చాలా సంవ‌త్స‌రాల కింద‌టే 10వ త‌ర‌గ‌తి పూర్తి చేశారా..? అయితే పోస్టల్ శాఖ తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ మీ కోస‌మే. ఎందుకంటే తెలంగాణ పోస్ట‌ల్ శాఖ‌లో గ్రామీణ డాక్ సేవక్ లో 645 ఖాళీలకు గాను నోటిఫికేష‌న్ విడుదలైంది. ముందు చెప్పిన విధంగా అర్హ‌త‌లు ఉంటే చాలు, ఎవ‌రైనా ఆ జాబ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

జ‌న‌ర‌ల్ విభాగంలో 356, ఓబీసీల‌కు 151, ఎస్సీల‌కు 86, ఎస్టీల‌కు 52 ఖాళీలు ఉన్నాయి. అప్లికేష‌న్ల‌కు చివ‌రి తేదీ ఏప్రిల్ 19. వాటిని ఆన్‌లైన్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. http://www.appost.in/gdsonline/ సైట్ ను సంద‌ర్శించి స‌ద‌రు ఉద్యోగానికి ఆన్ లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు పెట్టుకోవ‌చ్చు. ముందు చెప్పిన‌ట్టుగా 10వ తర‌గ‌తిలో వ‌చ్చిన మెరిట్ ఆధారంగా జాబ్ ల‌భిస్తుంది. ఈ జాబ్‌ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సు 18 నుంచి 40 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. జాబ్ ద‌ర‌ఖాస్తు రుసుం ఓసీ, ఓబీసీల‌కు రూ.100గా నిర్ణ‌యించారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ ఇదే శాఖ‌లో 1126 ఖాళీల భ‌ర్తీకి కూడా నోటిఫికేష‌న్ విడుద‌లైంది. పైన చెప్పిన నిబంధ‌ల‌న్నీ ఈ ఖాళీల‌కు కూడా వ‌ర్తిస్తాయి. కేవ‌లం 10వ త‌ర‌గ‌తి చదివి ఉంటే చాలు ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వ జాబ్‌ను సాధించ‌వచ్చు. ఇంకెందుకాల‌స్యం… వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి మ‌రి..!

#Online Application: CLICK HERE

Comments

comments

Share this post

scroll to top