ప్రజా సేవలో పోస్టల్ బ్యాంకు – సేవలు అపారం – సేవా పన్నులు నిల్

సమస్త భారత దేశంలో కోట్లాది ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలలో మొదటగా చెప్పాల్సి వస్తే పోస్టల్ శాఖదే. రైల్వెస్ ..సింగరేణి కార్మికులు తమ శ్రమను ధారా పోస్తున్నారు . అతి తక్కువ ధరకే వీరి సేవలు ఇతోధికంగా అందుతున్నాయి . ప్రపంచం మొత్తంగా ఆర్ధిక రంగం కుదేలై పోతే ఇండియా లో మాత్రం అలాంటి ఒడిదుడుకులు ఏవీ కనిపించే లేదు . ఎందుకంటే కారణం ఒక్కటే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోస్టాఫీస్ లతో పాటు ప్రభుత్వ బ్యాంకు లు కూడా ఉన్నాయి . కోట్లాది ప్రజలు కాస్త పడిన సొమ్మును ..డబ్బులను వీటిలోనే దాచుకున్నారు . దీనిపై కూడా పాలకుల కన్ను పడింది ..కానీ ఎంతో కట్టుదిట్టంగా కాపాడుకుంటూ వస్తున్న ఉద్యోగులు వారి ఆగడాలను ..ఆధిపత్యాన్ని సహించలేదు . ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూ వస్తున్నారు .

కేంద్రంలో మోడీ పీఎం అయ్యాక ఆర్ధిక రంగం కుదుపులకు లోనైంది . ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నీరు గారి పోయాయి . అత్యధిక వద్దే రేట్లు పోస్టాఫీసుల్లో ఉండేవి . ఏఫ్డీలు ..ఆర్దీలు ..పొదుపు ఖాతాలు వీటిలో అందుబాటులో ఉండేవి . అన్నిటికంటే నెల నెలా చేసిన పొదుపునకు వడ్డీ రూపేణా భారీగా అందేది . చాలా మంది ఎక్కువగా వీటినే నమ్ముకునే వారు . నేటికీ ఆయా గ్రామాలలో పోస్టాఫీసులనే నమ్ముకుంటారు . వాటినే ఉపయోగిస్తారు . బ్యాంకు లేని ఊరు ఉందేమో కానీ పోస్టాఫీస్ లేని ఊరు ఉండదు ..ఈ దేశంలో . సాంకేతిక పెరిగింది . దీంతో పాటు ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంకు ల నుండి ఎక్కువ పోటీ ఏర్పడింది . దీంతో పోస్టాఫీస్ లను పోస్టల్ బ్యాంకు లుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది పోస్టల్ శాఖ.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు పేరుతో కమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్స్ ద్వారా 2018 పూర్తిగా సేవలు అందించేలా అందుబాటులోకి వచ్చాయి . దేశంలో 1 , 55 , 015 పోస్టాఫీస్ లు ఉన్నాయి . 3 లక్షల మంది పోస్టుమ్యాన్ లు , డాక్ సేవక్ లు ఉన్నారు . మొదటగా 650 శాఖలు , 3250 పోస్ట్ ఆఫీస్ లలో బ్యాంకు లావాదేవీలు జరిగేలా స్టార్ట్ చేశారు . 10 వేల మంది పోస్ట్ మెన్స్ కు పదోన్నతి కల్పించారు . బ్యాంకు లో లావాదేవీలు జరిపేందు కోసమని. మొదటి విడతగా ప్రారంభించిన వీటిలో కేవలం పొదుపు ఖాతాలు ఓపెన్ చేయడం . డబ్బులు జమ చేసు కోవడం . తిరిగి ఇవ్వడం మాత్రమే చేస్తున్నారు . లోన్లు ఇవ్వడం లేదు . కేవలం 100 రూపాయలు వుంటే చాలు ఈ పోస్టల్ బ్యాంకు లో మీరు ఖాతా తెరవచ్చు .

అంతే కాదు ఎలాంటి రుసుములు ..సేవా పన్నులు అంటూ ఏవీ ఉండవు . ఎన్ని సార్లు అయినా సరే మీరు ఎక్కడున్నా సరే ఏ బ్యాంకు ఏటీఎం లలోనైనా మీకు అవసరమైన డబ్బులు తీసుకోవచ్చు . అదే వేరే ఏ బ్యాంకు లో ఖాతా వుంటే డబ్బులు తీయాలంటే ..మూడు సార్ల కంటే ఎక్కువగా తీస్తే సర్వీస్ చార్జీల మోత . ఇలాంటి ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు . దీనికంతటికి అనంత్ నారాయణ్ చూస్తున్నారు . ఆయా పోస్టాఫీస్ లలో పని చేస్తున్న వారికి వీటిని ఎలా నిర్వహించాలో ట్రైనింగ్ ఇచ్చారు . ఈ మేరకు అన్ని బ్రాంచ్ లలో కార్యకలాపాలు ..లావాదేవీలు స్టార్ట్ అయ్యాయి.

19 ఆగస్టు 2015 లో ఇండియా పోస్ట్ శాఖ పేమెంట్స్ బ్యాంకు కోసమని ఆర్బీఐ కి దరఖాస్తు చేశారు . 17 ఆగస్టు 2016 లో పబ్లిక్ లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ గా నమోదు చేశారు . పైలట్ ప్రాజెక్ట్ కింద జనవరి 2017 లో రాయపూర్ , రాంచి లో స్టార్ట్ చేశారు . కేంద్ర మంత్రి వర్గం 1435 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది . పొదుపు ఖాతాలే కాదు ఎంతైనా ..ఎన్ని డబ్బులైనా వీటి ద్వారా ఈజీగా పంపించుకునే సదుపాయం ఉన్నది . ఎలాంటి రుసుములు లేకుండా ఉన్న చోటనే విశిష్ట సేవలు అందిస్తున్న పోస్టల్ బ్యాంకు ల గురించి ప్రజలకు సరైన రీతిలో ప్రచారం చేయక పోవటం బాధాకరం . ఆయా జిల్లాలలో కలెక్టర్లు ..పోస్టల్ అధికారులు దీనిని జనాల్లోకి తీసుకు వెళ్లేలా చూడాలి . ఇకనైనా జనం తక్కువ ధరకే వచ్చే వీటి సేవలు ఉపయోగించు కునేందుకు ముందుకు రావాలి.

Comments

comments

Share this post

scroll to top