ఆమె బ్యాంకు అకౌంట్ లో పొరపాటున 125 కోట్లు జమయాయ్యి..! దీంతో ఆమె ఏం చేసిందో తెలుసా..?

ఉన్న ప‌ళంగా మీ బ్యాంక్ అకౌంట్‌లో కొన్ని కోట్ల రూపాయ‌లు అప్ప‌నంగా వ‌చ్చి ప‌డ్డాయ‌నుకోండి ? అప్పుడు మీరేం చేస్తారు ? అప్పుడు ఎవ‌రైనా సాధార‌ణ మ‌నిషిలాగే ఆలోచిస్తారు. కానీ నిజానికి అలా ఎందుకు జ‌రుగుతుంది చెప్పండి. బ్యాంకులు ముక్కుపిండి చార్జీల‌ను వ‌సూలు చేస్తాయి కానీ అంత పెద్ద మొత్తంలో పొర‌పాటుగా డ‌బ్బును అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తాయా ? అంటే.. అవును, అందుకు అవ‌కాశం ఉంది. ఒక్కోసారి ఇలా జ‌ర‌గ‌వ‌చ్చు. స‌రిగ్గా ఆ మ‌హిళ‌కు కూడా ఇలాగే జ‌రిగింది. కొన్ని మిలియ‌న్ డాల‌ర్లు ఆమె అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయి. వాటిని వేరే ఎవ‌రో వ్య‌క్తులు వేయ‌లేదు, బ్యాంకే ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. అయితే అంత డ‌బ్బు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమె నిజాయితీగానే వ్య‌వ‌హ‌రించింది.

అది ఆస్ట్రేలియా. ఆమె పేరు క్లేర్ వెయిన్‌రైట్‌. ఆమె ఓ లాయ‌ర్‌. అయితే నేష‌న‌ల్ ఆస్ట్రేలియా బ్యాంక్ (ఎన్ఏబీ) ఈ మ‌ధ్యే ఆమె అకౌంట్‌లోకి ఏకంగా 25, 102, 107 డాల‌ర్లను ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. దీంతో అన అకౌంట్‌ను చెక్ చేసుకున్న ఆమెకు అందులో 25 మిలియ‌న్ డాల‌ర్లు క‌నిపించాయి. దీంతో ఒక్క‌సారిగా ఆమె షాక్ అయింది. వెంటనే త‌న అకౌంట్ స్టేట్‌మెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్ర‌మంలో ఆ ఫొటో కాస్తా వైర‌ల్ అయింది.

అలా క్లేర్ విష‌యం వైర‌ల్ అయి అది బ్యాంక్ దాకా చేర‌డంతో వారు త‌ప్పు దిద్దుకునే చ‌ర్య‌లు చేప‌ట్టారు. అస‌లు ఆ బ్యాంక్ వారు క్లేర్‌కు మోర్ట‌గేజ్ లోన్ రీపేమెంట్ కింద 2500 డాల‌ర్ల‌ను పంపించాల్సి ఉంది. కానీ బ్యాంక్ వారు చేసిన త‌ప్పు వ‌ల్ల ఏకంగా 25 మిలియ‌న్ డాల‌ర్లు (125crores in rupees) ఆమె అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ క్లేర్ హుందాగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో బ్యాంక్ వారు ఆ డ‌బ్బును మ‌ళ్లీ తీసుకునే ప‌నిలో ప‌డ్డారు. నిజంగా ఆమె చాలా నిజాయితీతో ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే మ‌రొక‌రు అయితే వాటిని క‌చ్చితంగా కాజేసేవారు..!

Comments

comments

Share this post

scroll to top