క్రికెట్ ఎనాలిసిస్ అనే కొత్త తరహా కాన్సెప్ట్ తో యూట్యూబ్ లో పాపులర్ అయిన సందీప్ తో AP2TG స్పెషల్ ఫోకస్!

సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంది, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా లో వాళ్లకి నచ్చింది తోచింది చదవటం, చూడటం, రాయడం చేస్తూ వస్తున్నా సమయం ఇది. ఫేస్బుక్ , ట్విట్టర్, యూట్యూబ్ , ఇంస్టాగ్రామ్ ఇలా చాలా ప్లాటుఫార్మ్స్ ఉన్నాయి, ఈ ప్లాటుఫార్మ్స్ లో కంటెంట్ ఇచ్చే వాళ్ళు, పుచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుచ్చుకునే వాళ్ళ సంఖ్యా ఇచ్చే వాళ్ళ సంఖ్యా కన్నా తక్కువే ఉంటుంది.

social media importance

మన తెలుగు నాట కి వచ్చేసరికి యూట్యూబ్ ని ప్లాట్ఫారం గా బాగా ఉపయోగించుకొని ఎదిగిన వాళ్ళని మనం అలా సెర్చ్ చేస్తుంటే చూస్తూనే ఉంటాము. కొందరు పొలిటికల్ ఇంటర్వూస్ చేసి పాపులర్ అయ్యారు, కొందరు సినిమా ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయ్యారు, కొందరు కవర్ సాంగ్స్ అలాగే వెబ్ సిరీస్ మరియు వీక్లీ వీడియోస్ తీసి పాపులర్ అయ్యారు. కానీ ఇతను మాత్రం తెలుగు సోషల్ మీడియా నే కాదు తెలుగు టీవీ మీడియా లో కూడా పెద్దగా డిస్కస్ చేయని సరిగ్గా పట్టించుకోని స్పోర్ట్స్ రంగాన్ని పట్టుకొని ఒక కల్ట్ ఫాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇతని పేరు సందీప్ బొడ్డపాటి .

sandeep eagle media

సందీప్ , ఇంజనీరింగ్ అయ్యాక సిఎంబియాసిస్ లో మీడియా అండ్ కమ్యూనికేషన్ లో MBA చేసి ఉత్తమ విద్యార్ధి అవార్డు పుచ్చుకొని ఒక లీడింగ్ ఛానల్ లో మార్కెటింగ్ మేనేజర్ గా చేసి, తరవాత ఒక న్యూస్ ఛానల్ లో బ్రాండింగ్ హెడ్ గా చేసి, ఈగల్ మీడియా వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో భాగస్వామి అయ్యి, క్రికెట్ గురించి వీడియోస్ చేస్తుంటాడు. భారత్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ మీద ప్రీ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ఎనాలిసిస్ చేస్తూ, ప్లేయర్స్ గురించి ఆబ్సెర్వేషన్స్ చెప్తూ తెలుగు లో ఇంత చక్కగా ఎవరు వివరించి వర్ణించలేరు అనే ఒక ముద్ర ని సంపాదించుకున్నాడు. IPL లో భాగంగా ప్రతి ఒక్క మ్యాచ్ గురించి చెప్తూ, అందులో బాగా ఆడే ప్లేయర్స్ గురించి మాట్లాడుతూ, జనాలకి కన్ఫ్యూషన్ గా ఉండే అంశాలని ప్రస్తావిస్తూ తన వీడియోస్ ని వినసొంపు గా ఉండేట్టు గా మంచి భాష ని సుస్పష్టమైన తెలుగు ని ఉచ్చరిస్తూ తెలుగు క్రికెట్ ఫాన్స్ కి బాగా కావాల్సిన వ్యక్తి అయ్యాడు.

Sandeep eagle media with chandoo mondeti

IPL లో టీమ్స్ కి డబ్బులు ఎలా వస్తాయి అనే బిజినెస్ యాంగిల్ ను చెప్పిన ఏకైక తెలుగు వీడియో సందీప్ చేసిందే. అలాగే యో యో టెస్ట్ అంటే ఏంటి అని క్లియర్ గా అర్థం అయేట్టు చెపింది కూడా సందీప్ వీడియోనే . ప్రతి ఒక్క సిరీస్ ముందు, కీ ఫాక్టర్స్ ను ప్రస్తావించి, సిరీస్ తర్వాత కూడా ఇవి ప్రస్తావించి ఎంత వరకు ఉన్న సమస్య ని లేదా లోటు ని పూడ్చగలిగాం అనే దాని మీద వీడియో చేసి ఫాన్స్ అందరిలో కూడా ఒక అనలైటిక్ మైండ్సెట్ ని తీసుకొచ్చే ప్రయతనం చేస్తుంటాడు. వికెట్ స్లో గా ఉంటె ఎం అవుతుంది, బౌన్స్ ఎక్కువ ఉంటె బాట్స్మన్ చేసే అడ్జ్స్ట్మెంట్స్ గురించి, రికార్డ్స్ అండ్ స్టాటిస్టిక్స్ గురించి, ప్లేయర్ ఒక్క బలం బలహీనతలు గురించి సందీప్ ఎనాలిసిస్ చూస్తూ వింటుంటే ఇతను యూట్యూబ్ కె ఎందుకు పరిమితం అయ్యాడు, స్టార్ వాళ్ళు ప్రవేశ పెట్టిన తెలుగు కామెంటరీ లో ఎందుకు లేడు అని చాల మంది అనుకుంటారు, తన వీడియో కింద కామెంట్స్ కూడా చేస్తారు.

క్రికెట్ అంటే నే భారత్ లో ఒక క్రేజ్, ప్రతి ఒక్కళ్ళు క్రికెట్ గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు, యూట్యూబ్ లో ఉండే కామెంట్స్ సెక్షన్ లో వాళ్లకి తోచింది రాస్తూ అడుగుతూ అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉంటారు. అవన్నీ కూడా చూసి, రిప్లై ఇచ్చి లేదా ఆ అంశాల మీద వీడియోస్ తీసి ఇలా రెగ్యులర్ గా క్రికెటింగ్ డిస్కషన్స్ లో క్రికెట్ ఫాన్స్ అందరికి కావాల్సిన ఫుటేజ్ ఇస్తుంటాడు. మహిళా క్రికెట్ జట్టు ఆడిన మ్యాచులు అలాగే వాళ్ళు ఆడబోయే టౌర్నమెంట్లు వాళ్ళ బలాబలగాలు లాంటి అంశాలు మీద కూడా పూర్తి క్లారిటీ ఉంది. మహిళా క్రికెట్ గురించి ఏ ఒక్క అనలిస్ట్ కూడా తెలుగు లో ఇంత గా ఎనాలిసిస్ చేసి ఉండరు. అంతటి పట్టు ఉంది క్రికెట్ మీద సందీప్ కి.

సందీప్ కేవలం క్రికెట్ కె పరిమితం కాదు, రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు కూడా చేస్తాడు, విమర్శ అనే కమర్షియల్ ఆస్పెక్టు ని వాడకుండా ఒక ప్రతినిధి గా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గురించి స్టడీ చేసి ఆ ప్రశ్నలు మాత్రమే వేసి ఇంటర్వ్యూ ద్వారా ఏం చేస్తారు ఈ నాయకులూ వాళ్ళ ప్రజలకి అనే అంశం మీద డిస్కషన్ ఉండేట్టు చేసి తనదైన స్టైల్ లో అందర్నీ మెప్పిస్తాడు. రోశయ్య, జయప్రకాశ్ నారాయణ, కోళ్లు రవీంద్ర, పేర్ని నాని, లక్ష్మి పార్వతి , బాబు మోహన్, జగ్గారెడ్డి, కొండా సురేఖ, కోదండరాం , బాజిరెడ్డి గోవర్థన్ లాంటి హేమాహేమీలు వీడియో సాక్షిగానే మెచ్చుకున్నారంటే మామూలు విషయమా మరి. ఒక సందీప్ పొలిటికల్ ఇంటర్వ్యూ ఉంటె వీళ్ళకి మంచి ప్రశ్నలు వస్తాయి వీళ్ళ సమాధానాలు ఏంటి అని ఎక్సపెక్టషన్స్ ఉంటాయి గాని ఏం కాంట్రవర్సి చేసాడు అని మాత్రం అసలు ఉండదు.

Sandeep with rosaiah

రాజకీయం మాత్రమే కాదు., బిజినెస్ , ఆధ్యాత్మికం , ఎడ్యుకేషన్ ఇంటర్వూస్ లో కూడా ప్రతి ఒక్క టాపిక్ మీద క్షున్నంగా పరిశీలించి మంచి కొషన్స్ ప్రిపేర్ చేసి ఒక ఫ్రెండ్లీ డిబేట్ అండ్ ఆర్గుమెంట్ పెడతాడు. ఇవన్నీ మనం అడగలనుకున్నవి కదా అని మనందరినీ ఆశ్చర్య పరుస్తాడు.

బాబు గోగినేని ని అందరు మూఢ నమ్మకాల మీద డిబేట్స్ కి రమ్మంటే, సందీప్ ఆయనతో హ్యూమన్ రైట్స్ గురించి ఇంటర్వ్యూ చేసి, ఇండియా లో నే బాబు గోగినేని తో హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడిన ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యే లాగ చేసాడు. వీరమాచినేని రామకృష్ణ , ఎవరైతే చాలా మందికి ఒక ఆరోగ్య గురువు గా ఉన్నారో, ఆయనకీ అత్యంత ఇష్టమైన ఇంటర్వ్యూయర్ సందీప్. ఏకాకి వెళ్లిన కూడా రావాలి నాన్న నువ్వు అని మళ్ళీ మనం ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలి, నీకే నేను ఇంటర్వ్యూ ఇస్తాను యూట్యూబ్ లో అని చెప్తూ ఉంటారు. గుల్నార్ (ఆదర్శ్ బాలకృష్ణ భార్య) ఒక్క మంచి వ్యాపారవేత్త , ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ లో ఒక కొత్త తరహా మార్కెటింగ్ ని ప్రవేశ పెట్టడం లో కృషి చేస్తూ ఉంటారు. గుల్నార్ చేసే ప్రతి ఈవెంట్ కి సందీప్ ఉండాల్సిందే అని ఆవిడ ఒక వీడియో లో నే చెప్పారు.

ఇక సినిమా వీడియోస్ విషయానికొస్తే, బాహుబలి లో వాడిన సంసకృత పాదాల మీనింగ్స్ తో సినిమా వీడియోస్ స్టార్ట్ చేసిన సందీప్, సినిమా రివ్యూస్ అలాగే ఇంటర్వూస్ కూడా చేస్తుంటాడు. రాజీవ్ కనకాల, లక్ష్మి మంచు, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీరామ్ ఆదిత్య, చందు మొండేటి, ప్రియదర్శి, సమీర్, ప్రియాంక జవల్కర్ లాంటి సినీ తారలతో ఇంటర్వ్యూ చేసి మంచి ప్రశంసలు పొందాడు. లక్ష్మి మంచు ఆన్ రికార్డు చెప్పారు, ఇది తాను ఇచ్చిన ఇంటర్వూస్ లో ది బెస్ట్ అని, అలాగే రాజీవ్ కనకాల తన ఫేసుబుక్లో ఇదే మాట ని ప్రస్తావించారు. రైటర్ లక్ష్మి భూపాల తో చేసిన ఇంటర్వ్యూ కి సీనియర్ రచయిత సత్యానంద్ గారు కూడా మెచ్చుకున్నారు, సినిమా టెక్నికాలిటీస్, బిజినెస్ , సీన్ బ్రేక్డౌన్ అన్ని తెలిసిన ఒక వ్యక్తి లాగ మీ ప్రశ్నలు ఉన్నాయని శ్రీరామ్ ఆదిత్య , చందు మొండేటి అన్నారు. యూ ఆర్ సో డిఫరెంట్ అండ్ వెరీ గాడ్ అని ప్రియాంక చెప్పింది. ఇలా ఎవర్ని ఇంటర్వ్యూ చేసిన కూడా ప్రశంసలు పొందకుండా ఉండదు సందీప్.

ఏ వీడియో అయినా , ఈవెంట్ అయినా, టాపిక్ అయినా, అడిగే ప్రశ్నలు , అడిగే విధానం, రాబట్టే ఇన్ఫోర్మషన్ అన్ని కూడా సందీప్ లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. ఇలా తాను ఇన్ని రకాల వీడియో కంటెంట్ ఇస్తున్న, జనాలు మాత్రం తన క్రికెట్ వీడియోస్ ఎప్పుడు అంటూ కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. తాను మొదలుపెట్టి దాదాపు ఒక సంవత్సరం దాటినా, ఇలా ఇంకెవరు కూడా క్రికెట్ గురించి ఇలా యూట్యూబ్ అనలిస్ట్స్ అవలేకపోయారు, టీవీ లో కూడా ఎవరు పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు. మాకు ఉన్న డౌట్స్ నువ్వు భలే చెప్తావ్ అన్న అని అందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇలాంటి ఒక వ్యాఖ్యాత, అనలిస్ట్, మేధస్సు ఉన్న వ్యక్తికి త్వరలో ఒక మంచి పెద్ద అవకాశం రావాలని, టీవీ లో కామెంటరీ చేయాలి అని, తాను ఏవైతే అనుకున్నాడో అవన్నీ కూడా ఎటువంటి జాప్యం లేకుండా జరిగి తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సందీప్!

Comments

comments

Share this post

scroll to top